సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Jan 27, 2020 ,

గడీకోటలో ‘మన సంస్కృతి’ మేళా

గడీకోటలో ‘మన సంస్కృతి’ మేళా

దోమకొండ : మండల కేంద్రంలోని గడీకోటలో ఆదివారం ‘మన సంస్కృతి మేళా’ను నిర్వహించారు. గడికోట ట్రస్ట్‌ ప్రతినిధి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఉమాపతి ఆధ్వర్యంలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ సౌజన్యంతో సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహ న కల్పించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవే టు పాఠశాలల విద్యార్థులు తయారు చేసిన వస్తువుల తో ప్రదర్శనను నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు మేళాలో తాము తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. 

ఈ సందర్భంగా గడీకోట ట్రస్ట్‌ ప్రతినిధి ఉమాపతి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రకృతి ఆధారిత వివిధ రకాల వస్తువులను తయారు చేయడానికి కృషి చేయాలన్నారు. ప్రకృతి ప్రసాదించిన పదార్థాలను ఉపయోగిస్తే, సేంద్రి య పద్ధతిలో పండించిన ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు సేంద్రియ వ్యవసా యం వైపు మొగ్గుచూపాలని సూచించారు. మన సంస్కృతి మేళాలలో సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన చెరుకు పంటతో తయారు చేసిన బెల్లం, గో ఆధారిత మందులను చూసిన ఆయన అభినందించారు. కళాకారులు తయారు చేసిన జ్యూట్‌ బ్యాగులు, ఆ ర్గానిక్‌ విత్తన ఉత్పత్తులు, పాఠశాల విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలను చూసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు నృత్య పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. 

కార్యక్రమంలో జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఐరేని నర్సయ్య, సర్పంచ్‌ అంజలి శ్రీనివాస్‌, ఎంపీటీసీలు శంకర్‌, శారద, ట్రస్ట్‌ ప్రతినిధులు అనిల్‌, గడికోట మేనేజర్‌ బాబ్జి, వార్డు సభ్యు లు, గ్రామస్తులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. 


logo