శనివారం 06 జూన్ 2020
Nizamabad - Jan 27, 2020 ,

ఆహ్లాదకరంగా ఎట్‌ హోమ్‌

ఆహ్లాదకరంగా ఎట్‌ హోమ్‌

ఇందూరు: కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఎట్‌ హోమ్‌ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆహ్లాదకరంగా నిర్వహించారు. కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి, పోలీసు కమిషనర్‌ కార్తికేయ, శిక్షణ ఐపీఎస్‌ అధికారి, జిల్లా అటవీ అధికారి సునీల్‌, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో అంజయ్య, డీటీసీ వెంకట రమణ, ఎమ్మెల్సీ ఆకుల లలిత, జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బాలభవన్‌ పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, మెజీషియన్‌ రంగనాథ్‌ మాయలు, రాబర్ట్‌ మాట్లాడే బొమ్మ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రేపటితో అన్ని ఎన్నికల ప్రక్రియ పూర్తి కావస్తున్నందున జిల్లా యంత్రాంగం ఇక ప్రభుత్వ పథకాలు తదితర కార్యక్రమాల పై దృష్టి కేంద్రీకరించ నున్నదని తెలిపారు. ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మంచి టీం వర్క్‌తో పనిచేస్తున్నా అధికారులను సమన్వయంతో చేసుకుంటూ  ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పటి వరకు అధికారులకు అప్పగించిన అన్ని పనులు కూడా పొరపాట్లకు అవకాశం లేకుండా పూర్తి చేశారని పల్లె ప్రగత -2, మున్సిపల్‌ ఎన్నికలు తదితర కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారన్నారు. పోలీసు కమిషనర్‌తో అన్నింటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. జేసీ వెంకటేశ్వర్లు ప్రశాంతత, డీఆర్వో అనుభవం బాగా ఉపయోగపడుతున్నాయని, పల్లెప్రగతిలో డంపింగ్‌ యార్డులకు, శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయించడానికి అటవీశాఖ అధికారి మంచి సహకారం అందించారన్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు తమ్మి సరస్వతి, కావేటి లక్ష్మీనరసమ్మ, కె. లింగుబాయ్‌ను కలెక్టర్‌ సన్మానించారు. కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులను జ్ఞాపికలతో సన్మానించారు.


logo