మంగళవారం 02 జూన్ 2020
Nizamabad - Jan 27, 2020 , 01:18:39

ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలి

ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలి

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : ఎందరో మహనీయుల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నేతృత్వంలో రాజ్యాంగాన్ని తయారు చేసి అమలు చేశారని, రాజ్యాంగాన్ని గౌరవించాలని 7వ బెటాలియన్‌  కమాండెంట్‌ ఎన్‌వీ సాంబయ్య అన్నారు. ఆదివారం డిచ్‌పల్లి మండల 7వ బెటాలియన్‌ పరిపాలన భవనం ఎదుట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ మాట్లాడుతూ.. స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన వారందరినీ స్మరించుకుంటూ అన్నదమ్ములా కలిసి మెలసి ఉండాలని పిలుపునిచ్చారు. బెటాలియన్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్క జవాన్‌ తన విధులు సక్రమంగా నిర్వహిస్తూ అంకిత భావంతో పనిచేస్తూ దేశ రక్షణకు అంకితమవ్వాలని కోరారు. అనంతరం సిబ్బందికి, విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అసిస్టెంట్‌ కమాండెంట్లు బీ.సీతారామ్‌, కేవీ.రమణ, ఎస్‌.విష్ణుమూర్తి, దేవిదాస్‌ రాథోడ్‌, ఆర్‌ఐలు ఎం.శ్రీనివాస్‌రావు, వి.సంజీవ్‌రెడ్డి, వీసీహెచ్‌ కోటయ్య, రవి, సర్దార్‌ నాయక్‌, అనిల్‌కుమార్‌, మహేశ్‌, వెంకటేశ్వర్లు, ఆర్‌ఎస్సైలు, మినిస్టీరియల్‌, బెటాలియన్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. logo