బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Jan 27, 2020 ,

‘నమస్తే’ యూనిట్‌ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

‘నమస్తే’ యూనిట్‌ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : నమస్తే తెలంగాణ దినపత్రిక యూనిట్‌ కార్యాలయంలో ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మేనేజర్‌ గడ్డి ధర్మరాజు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహనీయులు పోరాట ఫలితంగా మనమందరం స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామని అన్నారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూ చించారు. కార్యక్రమంలో ఎడిషన్‌ ఇన్‌చార్జి రంగు ప్రవీణ్‌కుమార్‌, డిప్యూటీ మేనేజర్‌ (ఏడీవీటీ) శ్రీకాంత్‌, సర్క్యులేషన్‌ ఇన్‌చార్జి సునీల్‌,  హెచ్‌ఆర్‌ రవిశంకర్‌ యాదవ్‌, అకౌంటెంట్‌ గణేశ్‌, ఎలక్ట్రికల్‌ ఇన్‌చార్జి అనిల్‌, స్టోర్స్‌ ఇన్‌చార్జి శ్రీనివాస్‌,  రూరల్‌  ఆర్‌సీ ఇన్‌చార్జి లోకాని గంగారాం, సబ్‌ ఎడిటర్లు, సిబ్బంది పాల్గొన్నారు.logo