శనివారం 30 మే 2020
Nizamabad - Jan 27, 2020 ,

ఉత్తమ ఎన్‌సీసీ ఆఫీసర్‌గా సలీముద్దీన్‌

ఉత్తమ ఎన్‌సీసీ ఆఫీసర్‌గా సలీముద్దీన్‌

 లంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల నాగారంలో కెమిస్ట్రి లెక్చరర్‌గా, ఎన్‌సీసీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న కెప్టెన్‌ మహ్మద్‌ సలీముద్దీన్‌కు 12 బెటాలియన్‌ ఎన్‌సీసీలో ఎన్‌సీసీ ఆఫీసర్‌ - 2019గా సీఏటీసీ -10 క్యాంప్‌ అవార్డును అందుకున్నట్లు తెలంగాణ మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎంఏ అబ్దుల్‌ బషీర్‌ తెలిపారు. ఈ అవార్డును 12వ తెలంగాణ బెటాలియన్‌ క్యాంప్‌ కరస్పాండెంట్‌ కర్నల్‌ కె.వినయ్‌ బాలీ, లెఫ్టెనెంట్‌ కర్నల్‌ ఎస్‌ఎం వాలీ ఆదివారం అందజేశారని అన్నారు. కెప్టెన్‌ మహ్మ ద్‌ సలీముద్దీన్‌ పది సంవత్సరాలుగా ఎన్‌సీసీలో ఎన్‌ఐసీ, ఈబీఎస్‌బీ, కేఆర్‌డీసీ క్యాంపుల్లో పాల్గొన్నారని తెలిపారు. ఆయన శిక్షణలో ఎందరో పిల్లలు ఆర్మీలో చేరారని అన్నారు. నాగారం పాఠశాల ప్రిన్సిపాల్‌ బాగేందర్‌, టీచింగ్‌, నాన్‌ టీచిం గ్‌ అధ్యాపకులు సలీముద్దీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 


logo