శనివారం 30 మే 2020
Nizamabad - Jan 26, 2020 , 03:11:14

కారుదే పుర కేతనం

కారుదే పుర కేతనం
  • -బోధన్‌, ఆర్మూరు, భీమ్‌గల్‌ చైర్మన్లు టీఆర్‌ఎస్‌ కైవసం
  • - మూడు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యత
  • -నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో హంగ్‌z
  • -చివరి రౌండ్‌ వరకూ కొనసాగిన ఉత్కంఠ
  • -ఎంఐఎంతో కలిసి నిజామాబాద్‌ మేయర్‌ సీటు కైవసం చేసుకోనున్న టీఆర్‌ఎస్‌
  • - భీమ్‌గల్‌లో క్లీన్‌ స్వీప్‌చేసిన అధికార పక్షం
  • - రేపు మేయర్‌, చైర్‌పర్సన్ల ఎన్నిక
  • - క్యాంపులకు తరలిన విజేతలునిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి:మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో జిల్లాలో కారు జోరు కొనసాగింది. బోధన్‌, ఆర్మూరు, భీమ్‌గల్‌ బల్దియాల పీఠాలను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకుంది. ఈ మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మాత్రం హంగ్‌ వచ్చింది. దాదాపు సొంతంగానే నిజామాబాద్‌ మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ భావించింది. కానీ, టీఆర్‌ఎస్‌ 13 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ బీజేపీ బలం 28 స్థానాలకు పెరిగింది. ఎంఐఎంకు ఇక్కడ 16 స్థానాలు దక్కాయి. అయినా ఇక్కడ ఎంఐఎంతో కలిసి మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌ రెడీ అయ్యింది . మొత్తంగా పురపాలిక ఫలితాలు టీఆర్‌ఎస్‌లో ఉత్సాహాన్ని నింపాయి. తొలిసారి ఎన్నికలు జరిగిన భీమ్‌గల్‌ బల్దియాలో 12 వార్డులకు గాను మొత్తం స్థానాలు టీఆర్‌ఎస్‌ గెలుచుకున్నది. ఇక్కడ క్లీన్‌స్వీప్‌ చేయడంతో మంత్రి  ప్రశాంత్‌రెడ్డి వేల్పూర్‌లోని తన నివాసంలో సంబురాలు చేసుకున్నారు.

బల్దియా ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. జిల్లాలో కారు హవా కొనసాగింది. బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీలను స్పష్టమైన ఆధిక్యంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది.  నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో హంగ్‌ వచ్చింది. ఇక్కడ ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ కలిపి మేయర్‌ పీఠాన్ని దక్కించుకొనే అవకాశముంది. అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూడగా శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 వరకు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ ఫలితాలు వెలువడ్డాయి. సాయంత్రం వరకు నిజామాబాద్‌ ఫలితాలు వెల్లడయ్యాయి.  గెలుపొందిన అభ్యర్థులు సంబురాలు జరుపుకొన్నారు.
విజేతలను వారి అనుచరులు ఎత్తుకొన్ని సంతోషం వ్యక్తం చేశారు. స్వీట్లు తినిపించుకొన్నారు.logo