శనివారం 30 మే 2020
Nizamabad - Jan 25, 2020 , 01:28:56

తెలంగాణ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ మహాసదస్సు ప్రారంభం

తెలంగాణ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ మహాసదస్సు ప్రారంభం

ఖలీల్‌వాడి: తెలంగాణ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఐదో వార్షికోత్సవ మహాసభను డిచ్‌పల్లిలోని జీ కన్వెషన్స్‌ హాల్‌లో నేషనల్‌ ఆర్థోపెడిక్‌ అధ్యక్షుడు డాక్టర్‌ శివశంకర్‌ (సోలాపూర్‌) శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సదస్సులో భాగంగా మొదటిరోజు ఆర్థోపెడిక్‌ విభాగంలో అత్యాధునిక శస్త్ర చికిత్స విధానాలను ఫీచర్స్‌, వీడియోల ద్వారా చర్చించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు 500 మంది డాక్టర్లు హాజరయ్యారు. నూతన శస్త్ర చికిత్సల గురించి విపులంగా చర్చించారు. ఆర్థోపెడిక్‌ డాక్టర్లకు నూతన చికిత్సా విధానాలపై అవగాహన కల్పించారు. డాక్టర్లు చేయాల్సిన పనులపై చర్చించారు. ఇతర ఆర్థోపెడిక్‌ డాక్టర్లకు చికిత్స విశ్లేషణ చేసిన వారికి గోల్డ్‌మెడల్‌, సిల్వర్‌ మెడల్‌ను ప్రకటించారు. ఈ సదస్సుతో జూనియర్‌, సివిల్‌ డాక్టర్లకు, పేషంట్లకు, సమాజానికి నూతన విధానాల ద్వారా అనేక లాభాలు చేకూరుతాయని పలువురు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థోపెడిక్‌ విధానంలో ఎంతో నైపుణ్యత కలిగిన డాక్టర్లు ఉన్నారని, ఎలాంటి వైద్యం చేస్తే త్వరగా నయమవుతుందో, కొత్త విధానాలు, నూతన పద్ధతులను తెలుసుకొనేలా అధ్యయనం చేశారు. మారుతున్న కాలాన్ని బట్టి ఆర్థోపెడిక్‌ విధానంలో నూతన విధానాలు ఎన్నో రకాలుగా చేయవచ్చునని తెలిపారు. ప్రతి ఆర్థోపెడిక్‌ దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చికిత్స చేసే విధానంపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. కార్యక్రమం లో నేషనల్‌ అసోసియేషన్‌ డాక్టర్లు పంకజ్‌ జాండల్‌ (పుణే), జిగ్నేశ్‌ పాండే (అహ్మదాబాద్‌), అజిత్‌కుమార్‌ (మంగుళూరు), దేవేందర్‌రావు (కోయంబత్తూర్‌), అశోక్‌ గోవర్ధన్‌ (చైన్నె), గురువారెడ్డి (సిరిసిల్ల) పాల్గొని పలు అంశాలపై చర్చించారు. సదస్సు చైర్మన్‌ హరిప్రసాద్‌, కార్యదర్శి జయప్రకాశ్‌, డాక్టర్‌ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo