బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Jan 24, 2020 , 02:01:29

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

 కౌంటింగ్‌కు  సర్వం సిద్ధం
  • -రేపే ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాల వెల్లడి
  • -27న ఉదయం 11 గంటలకు గెలుపొందిన అభ్యర్థులతో ప్రమాణస్వీకారం
  • -మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్‌, చైర్మన్‌ ఎన్నిక
  • -పాలిటెక్నిక్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌
  • -పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశం
  • -ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్‌
  • -లెక్కలు వేసుకునే పనిలో నిమగ్నమైన నాయకులు

మున్సిపల్‌ ఎన్నికలు ముగియడంతో అభ్యర్థులంతా సేద తీరుతున్నారు. ఇక ఫలితాల వెల్లడి మిగిలి ఉంది. గెలుపు ఎవరిని వరిస్తుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. 25న జరిగే కౌంటింగ్‌ ప్రక్రియ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిజామాబాద్‌ నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో చేపడతారు. ఆర్మూర్‌ మున్సిపాలిటీ కౌంటింగ్‌ ప్రక్రియ పిప్రి గ్రామ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో, బోధన్‌లో అక్కడి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింపు, భీమ్‌గల్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అక్కడి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో చేపడతారు. 25న ఉదయం 7గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. తొలుత భీమ్‌గల్‌ మున్సిపాలిటీ ఫలితాలు వెల్లడి కానున్నాయి.         ఆ తర్వాత ఆర్మూర్‌, బోధన్‌ ఫలితాలు సాయంత్రం వరకు వస్తాయి. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండడంతో లెక్కింపు ఆలస్యం కానుంది. బ్యాలెట్‌ పద్ధతి అయినందున తుది ఫలితాల వెల్లడికి చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది.          -నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాలే మిగిలాయి. మొన్నటి వరకు ప్రచారంలో బిజీబిజీగా ఉండి ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేసిన అభ్యర్థులంతా సేద తీరుతున్నారు. గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియని ఉత్కంఠ కొనసాగుతోంది. 25న జరిగే కౌంటింగ్‌ ప్రక్రియ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిజామాబాద్‌ నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహించనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్మూర్‌ మున్సిపాలిటీ కౌంటింగ్‌ ప్రక్రియ పిప్రి గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తారు. బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బోధన్‌ ఓట్ల లెక్కింపు, భీమ్‌గల్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో భీమ్‌గల్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు. వీటినే స్ట్రాంగ్‌ రూమ్‌లుగా ఏర్పాటు చేసుకొని బ్యాలెట్‌ బాక్సులను

భద్ర పరిచారు. 25న ఉదయం 7గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. తొలుత భీమ్‌గల్‌ మున్సిపాలిటీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ తర్వాత ఆర్మూర్‌, బోధన్‌ ఫలితాలు సాయంత్రం వరకు వస్తాయి. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండడంతో లెక్కింపు ఆలస్యం కానుంది. తుది ఫలితాల వెల్లడికి చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈనెల 27న మేయర్‌, చైర్మన్ల ఎన్నిక నిర్వహించుకోవచ్చని ఎన్నిక షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయి.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. ఈనెల 27న ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు
చేసి కలెక్టర్‌ అధ్యక్షతన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వ

హిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. చేతులెత్తే ప్రక్రియ ద్వారా మేయర్‌, డిప్యూటీ మేయర్‌, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఉంటుంది.

కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌...

నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఓట్ల లెక్కింపు కోసం ఎంపిక చేసిన పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాట్లను కలెక్టర్‌ నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు. నగరంలో 60 డివిజన్లు ఉండగా.. రెండు కౌంటింగ్‌ హాళ్లను ఒక భవనంలోనూ, వెనుక భాగంలో మరో 30 డివిజన్లకు మూడు కౌంటింగ్‌ హాల్‌లను వెనుక భాగంలో లెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లు వెళ్లడానికి, అదే విధంగా కౌంటింగ్‌ సిబ్బంది వెళ్లడానికి వేర్వేరుగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఏ డివిజన్‌ పరిధిలోకి వెళ్లాలో వారికి అర్థమయ్యే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని ఏర్పాట్లు చేయాలని, వసతులు కల్పించాలన్నారు. కలెక్టర్‌ వెంట డీఆర్వో అంజయ్య, ఆర్డీవో వెంకటయ్య, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ జాన్‌ సాంసన్‌ తదితరులు ఉన్నారు.

టెన్షన్‌.. టెన్షన్‌...

పోటీచేసిన అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలయ్యింది. ఎగ్జిట్‌ పోల్స్‌ను బట్టి గెలుపోటములపై ఎవరి అంచనాల్లో వారున్నా.. చివరికి ఓటరు తీర్పు ఎలా ఉంటుందో తెలియక ఉత్కంఠకు లోనవుతున్నారు. ఓట్ల పండుగ ముగిసినా.. ఫలితాలు ఎవరికి అనుకూలమో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రచారానికి పెట్టిన ఖర్చు గురించి లెక్కలేసుకుంటున్నారు. గెలుపోటములు తెలుసుకునేందుకు, ఓటరు నాడిని పట్టుకునేందుకు విశ్లేషించుకుంటున్నారు. ఏ నలుగురు కలిసినా.. అంతటా ఇదే చర్చ  కొనసాగుతోంది.logo