విలీన గ్రామాల్లో పోలింగ్ సరళిపై బాజిరెడ్డి ఆరా

నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాల్లోని 6 డివిజన్లలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిపై ఎమ్మె ల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరాతీశారు. గురువారం తన ని వాస ప్రాంగణంలో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థు లు, స్థానిక పార్టీ నాయకుల తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై సమీక్షించారు. ఒక్కో డివిజన్ల వారీగా పార్టీ నాయకులతో పోలింగ్ సరళిపై చర్చించారు. డివిజన్ లో మొత్తం ఓట్లు, పోలైన ఓట్లు, అందులో టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఇతర పార్టీలకు ఎన్ని ఓట్లు పడి ఉండవచ్చుననే వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. 1, 3, 4, 5, 13, 18 డివిజన్లలో ముఖ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థులకు సుమారు ఎన్ని ఓట్ల వరకు పోలై ఉండవచ్చనే వివరాలను నాయకులు ఎమ్మెల్యేకు తెలిపారు. రూరల్, మోపాల్ మం డలాల్లోని విలీనమైన గ్రామాల ఆరు డివిజన్లలో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చా రు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పార్టీ తరపున నియమించిన ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈగ సంజీవ్‌రెడ్డి, నాయకులు గుత్ప రఘు, అభిలాష్‌రెడ్డి, ము స్కె సంతోష్, అక్బర్, నర్సాగౌడ్, స్వామి, అంజవ్వ, కొర్వ గంగాధర్, సాలూగారి మోహన్, సాయికుమార్, సత్యనారాయణగౌడ్, భీంసింగ్, చిటికెల శ్రీనివాస్‌రెడ్డి, చింతకుం ట శంకర్, క్యాతం హన్మాండ్లు, మొగిలి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలతో రానున్న నితిన్..
- కన్వీనర్ కోటాలో ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- ఏనుగుకు నిప్పు.. కాలిన గాయాలతో మృతి
- మార్కెటింగ్ శాఖలో 32 మంది ఉద్యోగులకు పదోన్నతి
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
- ఎస్ఈసీకి సీఎస్ ఆదిత్యానాథ్ మూడు పేజీల లేఖ
- కన్న తల్లిని కొట్టి చంపిన తనయుడు
- 24న వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో సీఎం సమీక్ష
- ట్రంప్ వాడే ‘రెడ్ బటన్’ తొలగించిన బైడెన్