గురువారం 28 మే 2020
Nizamabad - Jan 24, 2020 , 02:01:29

సౌత్‌ ఏషియన్‌ క్రీడల్లో ‘ఆదర్శ విద్యార్థుల ప్రతిభ’

సౌత్‌ ఏషియన్‌ క్రీడల్లో  ‘ఆదర్శ విద్యార్థుల ప్రతిభ’ధర్పల్లి : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు మహేందర్‌, సాయిరాం, బోజేశ్వర్‌, రాకేశ్‌ అంతర్జాతీయ క్రీడాపోటీల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయి ఖోఖో, వాలీబాల్‌ పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన వీరు..4వ సౌత్‌ ఏషియన్‌ క్రీడా పోటీలకు ఎంపికై సత్తాచాటారు. ఈనెల 22 నుంచి 23 వరకు నేపాల్‌లో జరిగిన క్రీడాపోటీల్లో భారత జట్టు తరపున పాల్గొని  గోల్డ్‌మెడల్స్‌ సాధించారు. గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో  విద్యార్థులను ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ రాజేందర్‌ సాహెబ్‌ సన్మానించారు. పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ఎంతో గర్వకారణమని, ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తున్నామని, ప్రిన్సిపాల్‌, పాఠశాల పీఈటీ కవిత తెలిపారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలని వారు ఆకాక్షించారు.

 


logo