గురువారం 28 మే 2020
Nizamabad - Jan 22, 2020 , 04:33:23

మున్సిపోల్స్ నేడే

మున్సిపోల్స్ నేడే


నమస్తే తెలంగాణ యంత్రాంగం: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో ఈవీఎంలను వాడడం లేదు. పాత పద్ధతిలోనే బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తున్నారు. పోలింగ్ కోసం సరిపడా బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. తెల్లటి రంగులో ఉండే ఈ బ్యాలెట్ పేపర్ అభ్యర్థుల గుర్తులు, పేర్లు ఉంటాయి. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి గుర్తుపై ఓటువేసి, బ్యాలెట్ బాక్స్ వేయాల్సి ఉంటుంది. జిల్లాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాటు బోధన్, ఆర్మూర్, భీమ్ మున్సిపాలిటీలు ఉన్నాయి. భీమ్ మున్సిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. బోధన్, భీమ్ బల్దియాల్లో ఒక్కో వార్డు చొప్పున ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఇవి పోను.. మొత్తం 144 వార్డులు/డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 4,36,887 మంది ఓటర్లు ఉండగా.. 621 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.   

 బల్దియా ఎన్నికల పోలింగ్ బుధవారం(నేడు) జరగనుండగా.. యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. శుక్రవారం సాయంత్రమే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తరహాలో ఈవీఎంలను వాడడం లేదు. ఈ ఎన్నికలకు పాత పద్ధతిలోనే బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. తెల్లటి రంగులో ఉండే ఈ బ్యాలెట్ పేపర్ అభ్యర్థుల గుర్తులు, పేర్లు ఉంటాయి. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి గుర్తుపై ఓటువేసి, ఒక పద్ధ్దతి ప్రకారం మడిచి బ్యాలెట్ బాక్స్ వేయాల్సి ఉంటుంది.వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాటు బోధన్, ఆర్మూరు, భీమ్ మున్సిపాలిటీలు ఉన్నాయి. భీమ్ మున్సిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి.logo