గురువారం 04 జూన్ 2020
Nizamabad - Jan 22, 2020 , 04:31:45

రాజ్యసభ పదవికి రాజీనామా చేసి మాట్లాడు..

రాజ్యసభ పదవికి రాజీనామా చేసి మాట్లాడు..నిజామాబాద్ రూరల్ : టీఆర్ భిక్ష పెట్టిన రాజ్యసభ పదవిని అనుభవిస్తూ  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) ఏమాత్రం నైతిక విలువలకు కట్టుబడి ఉన్నా, వెంటనే తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తన నివాస ప్రాంగణంలో మంగళవారం తన కుమారుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘దమ్ముంటే టీఆర్ నుంచి నన్ను సస్పెండ్ చేయాలి’ అంటూ డీఎస్ అర్థరహిత వ్యాఖ్యలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లను కోట్లాది రూపాయలకు అమ్ముకున్న చరిత్ర డీఎస్ అని, టీఆర్ నేతలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. టీఆర్ పార్టీ కట్టబెట్టిన రాజ్యసభ పదవిలో ఉంటూ, పరోక్షంగా ఏమి ఏరగనట్లుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా ఉందని బాజిరెడ్డి విమర్శించారు.

ఆయన కొడుకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ బీజేపీలో ఉండగా, తాను ఏ పార్టీలో ఉన్నాననే విషయమై డీఎస్ అయోమయంలోనే కొట్టుమిట్టాడుతున్నాడని ఎద్దేవా చేశారు. తండ్రీ కొడుకులిద్దరూ నిజామాబాద్ బీజేపీని సర్వనాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బీజేపీలో సిద్ధాంతం కలిగి ఉన్న నాయకులు తమ అనుచరులకు, మొదటి నుంచి బీజేపీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్లు ఇప్పించుకోలేక పోయారని, వారంతా అవమానంతో పాటు నిరాశ నిస్పృహలకు గురయ్యే పరిస్థితి ఆ పార్టీలో నెలకొందన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు డీఎస్ అనుచరులైన కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులకు, ఇప్పుడు తన కొడుకు ఎంపీ అరవింద్ ద్వారా బీజేపీ నుంచి బరిలో నిలపారని బాజిరెడ్డి ఆరోపించారు.

మోడీ ప్రభావంతో ఎంపీగా గెలిచిన అరవింద్.. నేడు నయా బీజేపీ లీడర్ అవతారమెత్తుతూ తన స్థాయిని మరచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం పెట్టుకొని  టీఆర్ అభ్యర్థులను ఓడగొట్టేందుకు మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నాయని బాజిరెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టీఆర్ 60 స్థానాల నుంచి అభ్యర్థులు బరిలో నిలిస్తే.. బీజేపీ 39 స్థానాల్లో మాత్రమే పోటీలో నిలబెట్టిందని తెలిపారు. ఉట్టికెక్కనోడు స్వర్గాన్ని ఎక్కిండన్న చందంగా ఎంపీ అరవింద్ తీరు ఉందని విమర్శించారు. ఎంపీ హోదాలో హుందాతనంగా ఉండాల్సింది పోయి, చిల్లర మాటలు మాట్లడడం అర్వింద్ చెల్లిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ పట్టం కడతారని, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానంతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్ మున్సిపాలిటీల చైర్మన్ల స్థానాలను టీఆర్ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినప్పటికీ.. టీఆర్ నాయకులు, కార్యకర్తలు సమయమనంతో మెలిగారన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించారని అభినందించారు. రాష్ట్రంలో మరో నాలుగేండ్లు టీఆర్ అధికారంలో కొనసాగనుందని అన్నారు.logo