శనివారం 06 జూన్ 2020
Nizamabad - Jan 22, 2020 , 04:30:29

జీవాలకు నట్టల నివారణ మందు వేయించాలి

జీవాలకు నట్టల నివారణ మందు వేయించాలి


కమ్మర్ నమస్తేతెలంగాణ/ ఏర్గట్ల / వేల్పూర్: జీవాలకు నట్టల నివారణ మందు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి బాలిక్ అహ్మద్  అన్నారు. కమ్మర్ మండలంలోని కోనాసముందర్ ఏర్గట్ల మండలంలోని తొర్తి గ్రామంలో, వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో  మంగళవారం జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నట్టల నివారణ మందు వేయించి జీవాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. అంతకు ముందు గొర్రెలకు నట్టల నివారణ మందు వేసి కార్యక్రమాన్ని కమ్మర్ వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్ ప్రారంభించారు.

ఏడాదికి నాలుగు సార్లు వేయించాలి

జీవాలకు ఏడాదికి నాలుగు సార్లు నట్టల నివారణ మందులు వేయించాలని పంశువర్ధక శాఖ జేడీ బాలిక్ మహ్మద్ అన్నారు. ఏర్గట్ల మండలంలోని తొర్తిలో గొర్రెలు, మేకలకు ప్రజాప్రతినిధులతో కలిసి నట్టల నివారణ మందులు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీవాలు అడవిలో గడ్డి మేసే క్రమంలో  నట్టలు, జలగలు, మట్టి, పురుగులు వాటి కడుపులోకి వెళ్లి వాటి పొట్టల్లో రెండింతలు పెరుగుతాయని అన్నారు. దీంతో జీవాల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని అన్నారు. నట్టల నివారణ మందు వేయించి జీవాలను కాపాడుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కర్నె రాజేశ్, మండల పశువైద్యాధికారి రాజశేఖర్, సర్పంచ్ కుండ నవీన్, ఉపసర్పంచ్ తాహెర్, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందుల వేసే కార్యక్రమాన్ని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బాలిక్ తనిఖీ చేశారు. మండల పశువైద్యాధికారి సంతోష్ సర్పంచ్ ద్వావతి వర్షిణి, రాజ్ తదితరులు పాల్గొన్నారు.


logo