మంగళవారం 26 మే 2020
Nizamabad - Jan 19, 2020 , 02:15:41

నిండు జీవితానికి రెండు చుక్కలు

 నిండు జీవితానికి రెండు చుక్కలు
  • -నేడు పల్స్‌ పోలియో
  • -ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా యంత్రాంగం
  • -జిల్లాలో 1021 బూత్‌ల ఏర్పాట్లు
  • -1.79 లక్షల మంది చిన్నారులకు.. 2,17,040 డోసుల మందు సిద్ధం
  • - ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా యంత్రాంగం
  • - జిల్లాలో 1021 బూత్‌ల ఏర్పాటు
  • - 1.79 లక్షల మంది చిన్నారులకు.. 2,17,040 డోసుల చుక్కల మందు సిద్ధం

ఖలీల్‌వాడి: ఆదివారం(నేడు) నిర్వహించే పల్స్‌ పోలియోకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 1021 బూత్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాలో నవజాత శిశువుల నుంచి మొదలుకొని ఐదేండ్లలోపు చిన్నారులు 1.79 లక్షల మంది ఉన్నారు. వీరికి పోలియో చుక్కల మందు వేయడానికి 2,17,040 డోసుల మందు సిద్ధం చేశారు.
ఈ కార్యక్రమం విజయవం చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలు, మండల కేంద్రాలతో పాటు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీలు, నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పల్స్‌ పోలియో కేంద్రాలు(బూత్‌లు) ఏర్పాటు ఏశారు.  ప్రభుత్వ దవాఖానలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ముఖ్య సెంటర్ల వద్ద పోలియో చుక్కల మందు వేయనున్నారు. మొదటి రోజు ఆదివారం బూత్‌ల వద్ద పోలియో చుక్కలను వేస్తారు. సోమ, మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఎవరైనా చిన్నారులు మిస్‌ అయితే వారికి పోలియో చుక్కల మందు వేస్తారు.
పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహణకు జనాభా ప్రాతిపదికన పోలియో బూత్‌లు, సిబ్బంది, వాహనాలు తదితర సౌకర్యాలను జిల్లా యంత్రాంగం కల్పించింది. జిల్లాలో గుర్తించిన 1.79 లక్షల మంది చిన్నారులకు వేసేందుకు 2,17040 డోసుల పోలియో చుక్కల మందు(పోలియో డీపీటీ) అందుబాటులో ఉంచారు.  

పల్స్‌ పోలియో  ఏర్పాట్ల  పరిశీలన..

నవీపేట: జిల్లాలో నిర్వహిస్తున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్‌వో సుదర్శనం అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీ శనివారం సందర్శించి పల్స్‌ పోలియో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ దవాఖాన స్థలాన్ని పరిశీలించి కబ్జాకు గురి కావడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రెవెన్యూ అధికారులతో స్థలాన్ని సర్వే చేయించాలని వైద్యాధికారులకు సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది వెంకటేశ్వర్లు  తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లు పూర్తి చేశాం..

ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయించడం తల్లిదండ్రులు బాధ్యతగా భావించాలి. పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాటు చేశాం. ఐసీడీఎస్‌, విద్య, విద్యుత్‌, మైనార్టీ సంక్షేమం, సాంఘిక సంక్షేమం, రెవెన్యూ శాఖలతో పాటు ఎన్జీవోస్‌లు, రోటరీ, లయన్స్‌క్లబ్‌లు ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నాం. 
-డాక్టర్‌ సుదర్శనం, డీఎంహెచ్‌వోlogo