ఆదివారం 31 మే 2020
Nizamabad - Jan 15, 2020 , 02:07:09

ప్రజారోగ్యానికే పల్లెప్రగతి

ప్రజారోగ్యానికే పల్లెప్రగతి
  • -మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి nవేల్పూర్‌లో ఆయా జీపీలకు ట్రాక్టర్ల పంపిణీ

గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం కాపాడడానికే సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర హౌసింగ్‌, భవనాలు, రోడ్లు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయా గ్రామాలకు మంజూరైన ట్రాక్టర్లను మంగళవారం మంత్రి పంపిణీ చేశారు. గతంలో ఎవరూ ఆలోచన చేయని విధంగా గ్రామాలు బాగుండాలని, పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలన్న ఆకాంక్షతో సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. మొదటి విడతగా 30 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారన్నారు. ఈ క్రమంలోనే మరోసారి రెండోవిడత కార్యక్రమం నిర్వహించామన్నారు.
- వేల్పూర్‌ విలేకరి

వేల్పూర్‌: గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం కాపాడడానికే సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర హౌసింగ్‌, భవనాలు, రోడ్ల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయా గ్రామాలకు మంజూరైన ట్రాక్టర్లను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయన్నారు. దీని స్పూర్తితో ప్రతి మూడు నెలలకు ఒకసారి పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో రెండో విడత పల్లె ప్రగతిని చేపట్టడం జరిగిందన్నారు. పల్లెలు శుభ్రంగా, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల అన్నారు. గ్రామాలు బాగుపాడాలని ప్రతినెలా గ్రామ పంచాయతీలకు నేరుగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నదన్నారు. గ్రామాల్లో చెత్త లేకుండా, పరిసరాలు శుభ్రంగా ఉండాలని ప్రతి గ్రామంలో ఇంటింటికి చెత్త బుట్టలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. చెత్తను తరలించడానికి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ను పంచాయతీ నిధుల నుంచి కొనుగోలు చేయడం జరిగిందన్నారు.  పల్లెలు పచ్చగా ఉండాలంటే ఆయా గ్రామాల్లో మొక్కలు పెంచాలన్నారు మండలంలో 15 పంచాయతీలు ట్రాక్టర్లు తీసుకోవడంతో మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో శ్రీనివాస్‌, ఎంపీడీవో కరుణాకర్‌, తహసీల్దార్‌ సతీశ్‌రెడ్డి, ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, వైస్‌ఎంపీపీ బోదపల్లి సురేశ్‌, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ నాగధర్‌, మిట్టాపల్లి మహిపాల్‌, కొట్టాల చిన్నారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. భీమ్‌గల్‌లోని లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో వేద పండితులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని ఆశీర్వదించారు.  ఈ సందర్బంగా స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ నెల 11న భీమ్‌గల్‌ నృసింహ స్వామి ఆలయంలో నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొనాలని వేద పండితులు మంత్రిని ఆహ్వానించారు. మంత్రి వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు ఉన్నారు.logo