శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Jan 15, 2020 , 02:06:35

ఎమ్మెల్యే షకీల్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరికలు

ఎమ్మెల్యే షకీల్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరికలు
బోధన్‌, నమస్తే తెలంగాణ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో పలువురు ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ సమక్షంలో మంగళవారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పట్టణంలోని రాకాసీపేట్‌ క్యాంప్‌ కార్యాలయంలో శివాలయం మాజీ చైర్మన్‌ గుమ్ముల సాయారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే షకీల్‌ సాయారెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలోని 18వ వార్డులో కౌన్సిలర్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్‌ వేసిన మదారోల్ల సంజీవ్‌ ఎమ్మెల్యే నివాసంలో పార్టీలో చేరారు. అనంతరం తన నామినేషన్‌ను ఉపసంహరించుకొని, గుణప్రసాద్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తానని సంజీవ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పర్బక్కల సాయిలు, నగేశ్‌ కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో నాయకులు ఎంఏ రజాక్‌, బోధన్‌ శివాలయం చైర్మన్‌ జెల్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, గుమ్ముల శంకర్‌రెడ్డి, ఎం.గుణప్రసాద్‌, గుమ్ముల అశోక్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ షేక్‌ ఫసియొద్దీన్‌, అజీజ్‌, ముంతాజ్‌, రవిశంకర్‌ గౌడ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
logo