శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Jan 14, 2020 , 03:46:58

‘జీరో వేస్ట్‌ కాన్సెప్ట్‌'అమలు చేయాలి

 ‘జీరో వేస్ట్‌ కాన్సెప్ట్‌'అమలు చేయాలి
  • - కలెక్టర్‌ నారాయణ రెడ్డిఇందూరు: అన్ని రకాల వృథాను తిరిగి ఉపయోగించి జిల్లాను జీరో వేస్ట్‌ వైపు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్లు కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ‘మన ఆకాశవాణి - మన నిజామాబాద్‌' కార్యక్రమంలో భాగంగా ఆయన స్థానిక రేడియో స్టేషన్‌లో ప్రజలతో మాట్లాడారు. ఈ నెల 2 నుంచి 12 వరకు నిర్వహించిన రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని, గ్రామాలన్నీ శుభ్రంగా తీర్చిదిద్దుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులు, నర్సరీలు ప్రతి గ్రామంలో ప్రారంభించడంతో పాటు ఇంటింటికీ ఇంకుడు గుంతలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఆయా గ్రామాల్లో పిచ్చి మొక్కలు తొలగించడం, మురికి కాలువలను శుభ్రం చేయడం, ఇంటింటి నుంచి చెత్తను సేకరించి కూల్చడం, పనికిరాని బావులను పూడ్చి వేయడం తదితర కార్యక్రమాల్లో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున వారి వంతుగా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని వివరించారు. గ్రామాల అభివృద్ధికి విరాళాలు అందించాల్సిందిగా జిల్లా యంత్రాంగం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని ఇందుకు గాను రూ. 1.60 కోట్ల నగదుతో పాటు రూ. 75లక్షల విలువచేసే వస్తువులను విరాళంగా అందించారని తెలిపారు. కార్యక్రమాల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రజలు ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం గొప్ప విషయమన్నారు.

ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తపై ప్రజలను భాగస్వామ్యం కల్పించడం ద్వారా వేర్వేరుగా సేకరించడానికి జిల్లా యంత్రాంగం ఆలోచిస్తుందని అన్నారు. ఈ చెత్తను డంపింగ్‌ యార్డుల్లో వేర్వేరుగా పోగు చేసి తడి చెత్తను కంపోస్ట్‌ ఎరువుగా తయారు చేయడానికి పొడి చెత్తలోని ఇనుము, సీసం, ప్లాస్టిక్‌ తదితర వృథాలను రీసైక్లింగ్‌ చేయించడం ద్వారా ఆయా గ్రామాలు జీరో వేస్ట్‌గా రూపొందించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఒక యంత్రాంగం మాత్రమే పనిచేస్తే సరిపోదని, ప్రజల సహకారం ఉన్నప్పుడే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని అన్నారు. భవిష్యత్తు తరాల క్షేమాన్ని, ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటిలో ప్రతి గ్రామంలో మొక్కలు నాటించడానికి చర్యలు తీసుకుంటాన్నామన్నారు. తద్వారా సమతుల వాతావరణం పెంపొంది వేడి తగ్గుతుందని వర్షాలు కురుస్తాయని అన్నారు. అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలలో విద్యా సంస్థలలో అక్కడికి వచ్చే ప్రజలకు కనీసం తాగునీరు, టాయిలెట్స్‌ ఏర్పాటు చేయడంతో పాటు చుట్టుపక్కల వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ప్రజాప్రతినిధులు మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత కార్యక్రమాల్లో పాలుపంచుకొని వారి వంతు విరాళాలు అందించి గ్రామాలను, పాఠశాలలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు.

పల్లె ప్రగతికి విరాళాలు అందించిన దాతలు

ఇందూరు/ నందిపేట్‌: తమ గ్రామాల అభివృద్ధికి, పాఠశాలల్లో సౌకర్యాల మెరుగుకు తమవంతుగా విరాళాలు అందించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 5న గ్రామాల్లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో విశేష స్పందన రావడంతో పాటు రూ. 1.60 కోట్ల నగదు రూపంలో విరాళాలు అందిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇంకా విరాళాలు అందిస్తూనే ఉన్నారు. సోమవారం కలెక్టర్‌ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. మాక్లూర్‌ మండలం చిక్లీ గ్రామానికి చెందిన డాక్టర్‌ గోపికృష్ణ, సర్పంచ్‌, వార్డు సభ్యులు, ప్రజలతో కలిసి కలెక్టర్‌ చాంబరు లో గ్రామాభివృద్ధికి రూ. 1.20 లక్షల చెక్కును విరాళంగా అందించారు. సిరికొండ మండలం గడ్కోల్‌ గ్రామానికి చెంది న రాచకొండ శ్రీనివాస్‌ గౌడ్‌ తన తండ్రి దేవాగౌడ్‌ ద్వారా రూ. 1.11 లక్షల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత మీ గ్రామాలకు వస్తానని అన్ని గ్రామాల్లో పరిశుభ్రత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు మరుగుదొడ్లు, ఇంకు డు గుంతలు, డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు పూర్తి చేసుకోవాలన్నారు. గ్రామమంతా కదిలితే ఊరు అభివృద్ధి చెందుతుందన్నారు. నందిపేట్‌ మండలం ఆంధ్రనగర్‌ గ్రామాభివృద్ధికి అదే గ్రామానికి చెందిన ఎలవర్తి రాజబాప య్య తన కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి కలెక్టర్‌ నా రాయణరెడ్డికి జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో రూ. 101116 చెక్కును అందజేశారు. అనంతరం రాజబాపయ్య కుటుంబ సభ్యులను కలెక్టర్‌ అభినందించారు. సర్పంచ్‌ రామారావు, గ్రామస్తులు పాల్గొన్నారు.logo