శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Jan 14, 2020 , 03:44:24

కౌంటింగ్‌ కేంద్రం కోసం డిగ్రీ కళాశాల భవనం స్వాధీనం

కౌంటింగ్‌ కేంద్రం కోసం డిగ్రీ కళాశాల భవనం స్వాధీనం


శక్కర్‌నగర్‌: బోధన్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రిన్సిపాల్‌ రంగారత్నం, భవనం కాంట్రాక్టర్లు సోమవారం మున్సిపల్‌ అధికారులకు అప్పగించారు. నూతనంగా నిర్మించిన ఈ కళాశాల భవనాన్ని అప్పగించేందుకు ఎన్నికల కోసం అప్పగించే విషయంలో కాంట్రాక్టర్లు కొంత ఇబ్బంది పడ్డారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ భవనం అయితే కౌంటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. ఇందులో బాగంగానే ఈ భవనాన్ని ఓట్ల లెక్కింపు కోసం కేటాయించారు. సోమవారం ఈ భవనాన్ని కాంట్రాక్టర్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకుల సమక్షంలో మున్సిపల్‌ డీఈ లింగంపల్లి శివానందం, ఏఈలు సందుపట్ల భూమేశ్వర్‌, శ్రీనివాస్‌లకు అప్పగించారు. ఈ భవనంలో కావాల్సిన ఏర్పాట్లను వెంటనే చేయించేందుకు డీఈ శివానందం సిబ్బందికి ఆదేశించారు.logo