శనివారం 30 మే 2020
Nizamabad - Jan 13, 2020 , 00:58:51

తెరచాటు రాజకీయం!

తెరచాటు రాజకీయం!


నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: సిద్ధాంతలు, విలువలకు తిలోదకాలు ఇచ్చి గెలుపు కోసం తెరవెనుక అనైతిక పొత్తుకు సిద్ధపడ్డాయి కాంగ్రెస్‌, బీజేపీలు. పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడగొట్టేందు కు కాంగ్రెస్‌ బీజేపీకి పూర్తి మద్దతు ఇవ్వడం, క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడడం మర్చిపోక ముందే.. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూ డా ఇదే విధానం అవలంభిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ తనంటతానుగా ఆత్మహత్య సదృశ్యంగా బీజేపీకి వంతపాడుతూ, మద్దతు ఇస్తూ బీజేపీ గెలుపు కోసం తెరవెనుక కృషి చేస్తున్నది. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ఇష్టారాజ్యంగా తన అ నుచరులకు టికెట్లను ఇస్తూ, ఇదే పార్టీలో సీనియర్‌ లీడర్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ వర్గానికి చెక్‌ పెట్టడంతో వివాదం రచ్చకెక్కింది. ఎంపీ అర్వింద్‌ టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ యెండల వర్గం శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేయడం చర్చనీయాశంమైంది. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో మొత్తం అరవై డివిజన్లు ఉన్నాయి. ఎలాగైనా మేయర్‌ పీఠం కైవసం చేసుకోవాలని బలంగా పాతుకుపోయిన టీఆర్‌ఎస్‌ను అనైతిక పొత్తులతోనైనా దెబ్బలు తీయాలని కాం గ్రెస్‌, బీజేపీ కుట్ర రాజకీయాలకు తెరలేపాయి.

కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేత ఒకరు తెరవెనుక ఉండి బీజేపీ గెలుపు కోసం తన అనుభవాన్ని అం త ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో బ లంగా ఉన్న అభ్యర్థులను బీజేపీలోకి పంపి, వారి కి బీఫారాలు ఇచ్చే విధంగా చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. చాలా డివిజన్‌లలో కాంగ్రెస్‌ బలహీనమైన అభ్యర్థులను పెట్టుకుంటూ, బలమైన అభ్యర్థులను బీజేపీ తరపున పోటీకి సిద్ధం చేస్తున్నది. నిజామాబాద్‌ నగరంలోని నాలుగో డివిజన్‌లో కాంగ్రెస్‌ నాయకుడైన ప్రమోద్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఈయనకు పుప్పాల శోభ అనే కాంగ్రెస్‌ నాయకురాలు బాహంటంగానే మద్దతు ఇస్తూ ఎన్నికల్లో గెలుపు కోసం కృషిచేస్తున్నారు. ఇ దొక్క ఉదాహరణ చాలు కాంగ్రెస్‌, బీజేపీల అనైతిక పొత్తు గురించి చెప్పడానికి. విలువలు, సిద్ధాంతాలను పాతాళానికి తొక్కేసి గెలుపే లక్ష్యం గా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ బీజేపీలపై.. ప్రజల్లో నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. కుట్ర రాజకీయాలతో, అనైతిక పొత్తులతో జనం ముందు ఈ పార్టీ నేతలు మరింత పలచన అవుతున్నారు.logo