శనివారం 30 మే 2020
Nizamabad - Jan 13, 2020 , 00:57:15

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

వేల్పూర్‌/ భీమ్‌గల్‌: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర హౌ సింగ్‌, రోడ్లు భవనాల శాఖ మంత్రి వే ముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం వేల్పూర్‌లో మంత్రి స్వగృహంలో భీమ్‌గల్‌కు చెందిన పలువురు గంగపుత్ర సం ఘం నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి  పార్టీ లో ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. కొంత కాలం నుంచి సాగు, తాగునీటికి కష్టాలు ఎదుర్కొన్న భీమ్‌గల్‌ వాసుల సమస్యలు పరిష్కరం టీఆర్‌ఎస్‌తో సాధ్యమన్నారు. కాళేశ్వరం ప్యాకేజీ -21 పనులతో భీమ్‌గల్‌ ప్రాంత సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయన్నారు. భీమ్‌గల్‌ పట్టణంలో రూ.25 కోట్లతో రో డ్లు, మురికి కాలువలు, సెంట్రల్‌ లైటిం గ్‌, శ్మశాన వాటికలు,పార్కు, మార్కెట్‌ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పేదల సంక్షేమ కోసం టీఆర్‌ఎస్‌ నిరంతరం శ్ర మిస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరడానికి అన్నివర్గాల నుంచి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని మంత్రి తెలిపారు.  కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు. భీమ్‌గల్‌ పట్టణ కేంద్రానికి చెందిన గంగపుత్ర సంఘం నేతలు ఆదివారం మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి మంత్రి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం భీమ్‌గల్‌ పట్టణంలోని జీసస్‌ లవ్‌ ఫుల్‌ గాస్పల్‌చర్చి సభ్యుల ఆహ్వానం మే రకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. పాస్టర్‌ షద్రక్‌ మంత్రిని శాలువాతో సన్మానించారు.


logo