శనివారం 30 మే 2020
Nizamabad - Jan 13, 2020 , 00:56:13

పరిశుభ్రత పాటిస్తేనే మరిన్ని నిధులు

పరిశుభ్రత పాటిస్తేనే మరిన్ని నిధులు


మోపాల్‌: పల్లెల్లో పచ్చదనం పరిశుభ్రత పాటిస్తే ఆ గ్రామాలను దత్తత తీసుకొని మరిన్ని నిధులు కేటాయిస్తామని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మోపాల్‌ మండలంలోని బాడ్సీ, సిం గంపల్లి గ్రామాల్లో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు గ్రామాలను పరిశీలించి పరిశుభ్రతకు సంబంధిం చి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ రెండు గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత నూటికి నూరు శాతం పాటిస్తే ఇరవై రోజుల తర్వాత ఈ రెండు గ్రామాల పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామాలను దత్తత తీసుకుంటానని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి తగిన నిధులను కేటాయిస్తానని అన్నారు. ఈ సందర్భంగా గ్రామా ల్లో మురికి కాలువలను శుభ్రం చేస్తూ గ్రామాలను శుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య సిబ్బందిని స న్మానించారు. వారిని ఆప్యాయంగా పలకరించా రు. గ్రామస్తులు గ్రామాల అభివృద్ధికి విరాళా లు ఇచ్చిన వారిని మా ఊరి మహారాజులుగా ప్రకటిం చి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ప్ర భు త్వ పాఠశాలను పరిశీలించిన కలెక్టర్‌కు గ్రామస్తు లు పలు సమస్యలు తెలపడంతో అన్ని సమస్యల ను తీరుస్తానని హామీ ఇచ్చారు. 

జిల్లా పరిషత్‌ పా ఠశాలకు రూ. 5లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. విద్యుత్‌ స్తంభాలు, భగీరథ పైపులై న్ల సమస్యలు చెప్పడంతో సంబంధిత అధికారుల కు ఆదేశాలు జారీ చేస్తూ 16, 17 తేదీల్లోగా విద్యు త్‌ స్తంభాలు అవసరమైన మిషన్‌ భగీరథ పైపుల ను ఈ గ్రామాలకు అందించాలని సూచించారు. సమావేశంలో డీపీవో జయసుధ, ఎంపీవో ఎక్బా ల్‌ హైమాద్‌, మోపాల్‌ ఎంపీపీ లతాకుమారి, సర్పంచులు కోల గంగాధర్‌, విజయ, ఎంపీటీసీ జమున, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.


logo