శనివారం 06 జూన్ 2020
Nizamabad - Jan 12, 2020 , 02:01:34

పల్లెప్రగతితో పల్లెలకు నూతన శోభ

పల్లెప్రగతితో పల్లెలకు నూతన శోభఆర్మూర్‌, నమస్తే తెలంగాణ/ నందిపేట్‌: ఆ ర్మూర్‌ నియోజకవర్గంలోని ఆర్మూర్‌, మాక్లూ ర్‌, నందిపేట్‌ మండలాల్లోన్ని అన్ని గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పనులతో పల్లెల్లో నూతన శోభ సంతరించుకుంది. ఆర్మూర్‌ మండలంలోని 18 గ్రామా ల్లో పల్లెప్రగతి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆర్మూర్‌ మండలంలోని రాంపూర్‌లో తడి, పొడి చెత్తలపై సర్పంచ్‌ దయానంద్‌ పల్లె ప్రగతి ప్రత్యేకాధికారి గంగారాం, అధికారులు పల్లెప్రగతిపై అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో సర్పంచులు పుట్టింటి లింబారెడ్డి, మచ్చర్ల పూజిత కిశోర్‌రెడ్డి, గడ్డం సరోజ గంగారెడ్డి, టీసీ సాయన్న, కల్లెం మోహన్‌, నీరడి రాజేశ్వర్‌, పెద్దపల్లి లక్ష్మి, బండమీది జమున, దీవెన, చౌడ సాయిలత తదితరులు పాల్గొన్నారు. నందిపేట్‌ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు కొనసాగాయి. గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిదులు వీధులను, పరిసరాలను శుభ్రం చేశారు. డంపింగ్‌ యార్డులను ఏర్పాటుచేసుకోవాలని అందులోనే చెత్తను వేసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారి బాలిక్‌ అహ్మద్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


logo