శనివారం 30 మే 2020
Nizamabad - Jan 12, 2020 , 01:58:33

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి


నిజామాబాద్‌: పురపాలిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌ శా ఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ శనివారం నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తాతో స మీక్షా నిర్వహించారు.  ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, ప్రచార తీరుతెన్నులు, అభ్యర్థుల ఎంపిక, పార్టీ విజయం కోసం అనుసరిస్తున్న వ్యూహం తదితర అంశాలపై చర్చించారు. ఇప్పటికే నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో.. ఇక ప్రచారంపై ప్రత్యేక దృష్టిసారించాలని, ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల గురించి వివరించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని సూచించారు. సీఎం, పార్టీ అధినేత కేసీఆర్‌  మార్గదర్శ నం మేరకు పనిచేయాలని సూచించారు. బీ-ఫారాల అందజేత విషయంలో జా గ్రత్త వహించాలని కేటీఆర్‌ సూచించారు. పార్టీ నుంచి రెబల్‌ అభ్యర్థులుగా పోటీలో ఉండే వారితో నామినేషన్‌ ఉపసంహరణ కోసం ప్రయత్నాలు చేయాలని సూచించారు. పురపాలికల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ల్లేలా ప్రచారం ఉండాలని ఆదేశించారు. పార్టీ ప్రచార సామగ్రి చేరవేత వంటి అంశాలపైన పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పురపాలికలకు దగ్గర ఉన్న గ్రామీణ ప్రాంతాల పార్టీ నాయకుల సేవలను వినియోగించుకోవాలని సూచించా రు. పార్టీ ఇన్‌చార్జిలు ఎన్నికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని,  రానున్న పది రోజులు కష్టపడి పనిచేయాలని, ఎన్నికలను ఈజీగా తీసుకోవద్దని సూచించారు. మెజారిటీ కౌన్సిలర్‌ స్థానాలు గెలుచుకోవాలని కేటీఆర్‌ సూచించారు.


logo