బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Jan 09, 2020 , 18:27:42

బోధన్‌లో తొలిరోజు ఏడు నామినేషన్లు

బోధన్‌లో తొలిరోజు ఏడు నామినేషన్లు

శక్కర్‌నగర్‌: బోధన్‌ మున్సిపాలిటీకి జరిగే ఎన్నికల కోసం బుధవారం తొలిరోజు ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులకు దాఖలు చేశారు. 18వ వార్డు నుంచి కర్రోళ్ల గంగారాం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. 24వ వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా జి.సుధారాణి, వార్డు నంబర్‌ 27 నుంచి స్వతంత్ర అభ్యర్థిగా హైమద్‌ అబ్దుల్లా, మూడో వార్డు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున కె.రాధాకృష్ణ, ఆరో వార్డు నుంచి ఎంఐఎం పార్టీ తరపున మహ్మద్‌ హబీబ్‌ఖాన్‌, 22వ వార్డు నుంచి బీజేపీ నుంచి మిద్దెల సుమలత నామినేషన్లు సమర్పించారు. మొత్తం ఆరుగురు అభ్యర్థులు 7 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్‌ దాఖలు కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నామినేషన్ల సందర్భంగా ప్రధాన ద్వారం నుంచి లోనికి ఎవరినీ రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా, డిగ్రీ కాలేజీ వైపు గేట్లను భారీకెడ్లతో మూసివేసి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నామినేషన్ల కోసం 121 మంది దరఖాస్తు ఫారాలను స్వీకరించారు.

విద్యార్థులకు తరగతుల మార్పు...
బోధన్‌ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా విద్యార్థులకు తరగతులకు ఇబ్బందులు కలగకుండా పక్కనే ఉన్న సీడీసీ కార్యాలయంలో కొనసాగించారు. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 11 వరకు ముగిసేవరకు తరగతులను సీడీసీ కార్యాలయంలో కొనసాగిస్తామని కళాశాల ప్రిన్సిపాల్‌ గురువారెడ్డి తెలిపారు. సంక్రాంతి సెలవుల అనంతరం ఈనెల 16 నుంచి కళాశాలలో తరగతులు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.


logo