శనివారం 16 జనవరి 2021
Nizamabad - Jan 09, 2020 , 18:26:44

పరిసరాల శుభ్రతపై అవగాహన

పరిసరాల శుభ్రతపై అవగాహన

డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ : జక్రాన్‌పల్లి మం డలం సికింద్రాపూర్‌ గ్రామంలో బుధవారం తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందం సభ్యులు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరితహారానికి సంబంధించి పాటల రూపంలో నృత్యాలు చేస్తూ అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని సూచించారు. బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండాలని వారు అన్నారు. కార్యక్రమంలో సర్పం చ్‌, ఉపసర్పంచ్‌, బృందం సభ్యులు సతీశ్‌, తొగరి నర్సయ్య, సాయి, గోరటి రాజు, విజయలక్ష్మి, శిల్ప, లత, రవి తదితరులు పాల్గొన్నారు.