గురువారం 04 జూన్ 2020
Nizamabad - Jan 09, 2020 , 18:09:39

కదంతొక్కిన కార్మికలోకం

కదంతొక్కిన కార్మికలోకం

-జిల్లాలో సార్వత్రిక సమ్మె విజయవంతం
-భారీ ర్యాలీలో పాల్గొన్న కార్మికులు, ఉద్యోగులు
-కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం
ఖలీల్‌వాడి : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవాం జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగింది. సమ్మెలో కార్మికులు, కూలీలు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు, జర్నలిస్టులు పలువురు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించారు. అ నంతరం పలువురు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకుంటుందన్నారు. కార్మిక చట్టాలను సవరించి హక్కులను కాలరాస్తుందని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

పోరాడి ఎల్‌ఐసీని కాపాడుదాం
ఉద్యోగులందరం ఐక్యంగా ఉండి ప్రైవేటీకరణకు వ్యతిరేకం గా పోరాడి ఎల్‌ఐసీ సంస్థను కాపాడుకుందామని ఇన్సూరె న్సు కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి రాజేశ్‌కుమార్‌ అన్నారు. నిజామాబాద్‌ శాఖ కార్యాలయం ఎదుట బీమా ఉద్యోగులు బుధవారం ధర్నా నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్‌ఐసీ ప్రీమియంపై వసూలు చేస్తున్న జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తు న్న విధానాలను విమర్శించారు. కా ర్యక్రమంలో శివశంకర్‌, ఆనంద్‌కుమార్‌, సత్యనారాయణ, శంకర్‌ సా మ్రాట్‌, గంగాధర్‌, సంతోష్‌, దేవాచారి పాల్గొన్నారు.

బ్యాంకుల పటిష్టతకు కృషి చేయాలి
బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించి సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రభుత్వ బ్యాంకుల పటిష్ఠతకు, బ్యాంకుల వి లీనాలకు వ్యతిరేకంగా పోరాటం చే స్తున్నామని బ్యాంకు ఉద్యోగుల సమస్వయ సంఘం అధ్యక్షుడు బోసుబా బు అన్నారు. బస్టాండ్‌ పక్కన ఎస్‌బీ ఐ బ్యాంక్‌ వద్ద బ్యాంకు ఉద్యోగ అధికార సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో కిషన్‌రావు, రంజిత్‌కుమా ర్‌, మనోజ్‌కుమార్‌, రాజన్న, దివాకర్‌ రెడ్డి, గంగామోహన్‌, సందీప్‌ శర్మ, నాగభూషణం స్వామి, రాజ్‌కుమార్‌, వంశీకృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

‘విద్యుత్‌ చట్టం 2003’ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలి..
‘విద్యుత్‌ చట్టం 2003’ అమలు చేయడానికి కేంద్ర ప్రభు త్వం ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నానికి స్వస్తి పలకాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియర్‌ నాయకులు బాలేశ్‌కుమార్‌కుమార్‌ అన్నారు. బుధవారం నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ అండ్‌ ఇంజినీర్స్‌ జాతీయ సంఘం పిలుపు మేరకు సార్వత్రిక సమ్మెను పవర్‌హౌస్‌ కార్యాలయం వద్ద నిర్వహించారు. కార్యక్రమంలో తోట రాజశేఖర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, గంగారాం నా యక్‌, శ్రీనివాస్‌, సురేశ్‌కుమార్‌, శ్రీనివాస్‌రావు, లక్ష్మణ్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల్లో అవగాహన కల్పించడంలో జర్నలిస్టులే కీలకం
ప్రభుత్వాల విధానాలు, పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ, ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడంలోనూ జర్నలిస్టులు సంధానకర్తలుగా కీలక భూమిక పోషిస్తున్నారని టీడబ్ల్యూ జేఎఫ్‌ అధ్యక్ష కార్యదర్శులు కుంచం శ్రీనివాస్‌, పానుగంటి శ్రీనివాస్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బు ధవారం సార్వత్రిక సమ్మె సందర్భంగా తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ యోహన్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. జర్నలిస్టులు ఉద్యోగ భద్రత లేక అరకొర వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వర్కింగ్‌ జర్నలిస్టులకు అండగా నిలిచే కార్మిక చట్టాల నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందని ఆరోపించారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో సభ్యులు నర్సింహరెడ్డి, రాంచందర్‌ రెడ్డి, కోరి రాకేశ్‌, మధు, పరమేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo