e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home కామారెడ్డి వరి కలుపు నివారణలో జాగ్రత్తలు

వరి కలుపు నివారణలో జాగ్రత్తలు

వరి కలుపు నివారణలో జాగ్రత్తలు
  • తెలియని మందులు వాడొద్దు
  • వరి, చెరుకు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.సురేశ్‌

రుద్రూర్‌, జూలై 20: ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరుకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో, ఎలా వాడాలో అన్ని వివరాలుపూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాల్సి ఉంటుంద ని, సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలు పు మందులను ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదని రుద్రూర్‌ మండల కేంద్రంలోని వరి, చెరుకు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.సురేశ్‌ చెబుతున్నారు. వివిధ రకాల్లో వరి సాగు చేసే రైతులు కలుపు యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు పాటించాల్సిన సూచనలను వివరించారు.

వరిలో కలుపు యాజమాన్యం
పంటలో విత్తిన లేదా నాటిన 45 రోజుల వరకు కలుపు లేకుండా రైతులు జాగ్రత్త వహించాలి.
మెట్ట వరిలో విత్తిన 48 గంటల్లోపు పెండి మిథాలిన్‌ 1.2లీటర్లు లేదా పెండి మిథాలిన్‌ ఎక్స్‌ట్రా 700 మి.లీ మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి.
దమ్ము చేసిన పొలంలో విత్తన 3-5 రోజులకు లేదా నాట్లు వేసిన 3-5 రోజులకు ప్రిటిలాక్లోర్‌+ సేఫ్‌నర్‌ 600-800 మి.లీ(లేదా) బ్యూటాక్లోర్‌ 1-1.5 లీటర్లు / ఆక్సాడయార్జిల్‌ 35-45 గ్రాములు/ ప్రిటిలాక్లోర్‌ + బెన్‌ సల్ఫూరాన్‌ మిథైల్‌ 4 కేజీల గుళికలు 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి.
విత్తిన (లేదా) నాటువేసిన 8-10 రోజుల్లోపు పైరజోసల్ఫ్యూరాన్‌ ఇథైల్‌ 80-100 గ్రాములు వాడుకోవడం ద్వారా గడ్డిజాతి కలుపును నివారిస్తుంది. లేకపోతే పైరజోసల్ఫ్యూరాన్‌ ఇథైల్‌ + ప్రిటిలాక్లోర్‌ 4 కేజీల గుళికలు విత్తిన 8-10 రోజుల్లోపు పొలంలో చల్లుకోవాలి.
విత్తిన(లేదా) నాటిన 15-20 రోజుల్లోపు సైహలోపాప్‌ పి బ్యూటైల్‌ 400 మి.లీ. లేదా ఫినాక్సీ ప్రాప్‌ ఇథైల్‌ 250 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇవి గడ్డిజాతి కలుపు(ఊద, ఒడిపిలి) నివారణకు తోడ్పడుతుంది.

- Advertisement -

తుంగజాతి, వెడల్పాకు కలుపు నివారణకు మెట్‌ సల్ఫ్యూరాన్‌ మిథైల్‌+ క్లోరిమ్యూరిన్‌ 8గ్రా./ బిస్‌ పైరిబాక్‌ సోడియం(గడ్డిజాతి, వెడల్పాకు కలుపు నివారణకు) 100 మి.లీ. ఒక ఎకరానికి చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
వెడల్పాకు కలుపు నివారణకు 20-30 రోజులకు 2,4-డి సోడియం సాల్ట్‌ అనే మందును 400-500 గ్రా. ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఈ మందును పిచికారీ చేసినప్పుడు వరి పైరు తాత్కాలికంగా ఎర్రగా మారుతుంది. అప్పుడు ఎకరానికి 10 కిలోల యూరియా పైపాటుగా వేసుకుంటే పంట యథాస్థితికి వస్తుంది.
కలుపు మందులు పిచికారీ చేసేందుకు సాధ్యమైనంత వరకు స్ప్రేయర్లను విడిగా ఉంచుకోవాలి. అలా వీలుకాని నేపథ్యంలో ఈ మందులను చల్లిన వెంటనే ఏమాత్రం అవశేషాలు లేకుండా మంచినీటితో పలుమార్లు శుభ్రం చేయాలి. పిచికారీ చేయుటకు స్పష్టమైన సూచనలు లేనిదే కలుపు మందులను, పురుగు, తెగుళ్ల మందులతో కలుపొద్దు.
కాలపరిమితి దాటిన మందులను వాడొద్దు.
కలుపు మందులను హ్యాండ్‌ స్ప్రేయర్‌తోనే పిచికారీ చేయాలి. పిచికారీ చేయుటకు సరైన నాజిల్‌ వాడాలి.
ఎండ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు కలుపు మందులు పిచికారీ చేయరాదు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో గాలి తక్కువగా ఉన్నప్పుడే పిచికారీ చేయడం మంచిది.
కలుపు నిర్మూలనకు పరిమితంగా రసాయనాలను వాడుతూ, వీలైతే అంతరకృషి చేయడం వంటి సేద్య పద్ధతులు పాటిస్తూ సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతులను పాటిస్తే పర్యావరణ పరిరక్షణతోపాటు అధిక దిగుబడులు సాధించవచ్చని, సందేహాలుంటే 8978672595 సంప్రదించాలని సూచించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వరి కలుపు నివారణలో జాగ్రత్తలు
వరి కలుపు నివారణలో జాగ్రత్తలు
వరి కలుపు నివారణలో జాగ్రత్తలు

ట్రెండింగ్‌

Advertisement