e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 23, 2021
Home కామారెడ్డి పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి

పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి

పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి

నవీపేట,జూలై 11: స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చొరవతో సీఎం కేసీఆర్‌ రాష్ట్ర బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించారని.. నిధులు విడుదల కాగానే గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మండలంలోని నారాయణపూర్‌ గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్లె ప్రగతి ముగింపు కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు ఆర్‌.రాంకిషన్‌రావు, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. స్థానిక సంస్థలకు బడ్జెట్‌లో నిధులను కేటాయించడం పట్ల ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. హరితహారంలో భాగంగా జిల్లాలో 59 లక్షలు మొక్కలు నాటినట్లు చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడి విన్నపం మేరకు గ్రామంలో బీటీ రోడ్డు మంజూరుకు తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో భూముల ధరలకు రెక్కలు..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గతంలో ఎన్నడూలేని విధంగా భూముల ధరలకు రెక్కాలు వచ్చాయని ఆర్‌.రాంకిషన్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ కేవలం ఐదేండ్లలో నిర్మించి చూపించార న్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిండడంతో జిల్లాకు చెందిన బీడు భూములు సాగులోకి వస్తున్నాయని దీంతో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయని గుర్తు చేశారు. తన అత్తగారి ఊరైన నారాయణపూర్‌ అభివృద్దికి తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. తన తండ్రి నారాయణరావు జ్ఞాపకార్థం శవపేటికను(ఫ్రీజర్‌) ను గ్రామ పంచాయతీకి అందజేసినట్లు చెప్పారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం గ్రామాభివృద్ధికి నారాయణపూర్‌ దాతలు హోక్కెర్ల సా యన్న జ్ఞాపకార్థం ఆయన కుమారులు విఠల్‌రావు, నర్సింగ్‌రావులు రూ.లక్ష విరాళంగా ఇవ్వడంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్‌, సర్పంచ్‌ గొట్టి లతా రాజు, ఎంపీటీసీ బట్టు రాణి లక్ష్మణ్‌రావు, జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతికుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వి.నర్సింగ్‌రావు, ఎంపీడీవో సయ్యద్‌ సాజీద్‌ అలీ, బినోలా సొసైటీ మాజీ చైర్మన్‌ వి.కిశోర్‌రావు,యంగ్‌ స్టార్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌రావు, గ్రామ కార్యదర్శి మసూద్‌, నాయకులు గొట్టి రాజు, బట్టు లక్ష్మణ్‌రావు, రచ్చ సుదర్శన్‌, మహిళా సంఘాల అధ్యక్షురాలు,గ్రామ మాజీ సర్పంచి చిన్నుబాయి,మహిళలు,యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి
పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి
పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి

ట్రెండింగ్‌

Advertisement