e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home కామారెడ్డి ఘనంగా డీసీసీబీ చైర్మన్‌ జన్మదిన వేడుకలు

ఘనంగా డీసీసీబీ చైర్మన్‌ జన్మదిన వేడుకలు

రుద్రూర్‌/కోటగిరి/ వర్ని జూలై 23 : డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి జన్మదిన వేడుకలను జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేకులు కట్‌చేసి, మొక్కలను నాటి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రుద్రూర్‌ మండల కేంద్రంలో ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్‌, బొప్పాపూర్‌లో జడ్పీటీసీ నారోజి గంగారామ్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
కోటగిరి ఎంపీడీవో కార్యాలయంలో కేక్‌ కట్‌చేసిన అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు, అనాథాశ్రమంలో పిల్లలకు పండ్లను పంపిణీ చేశారు. ఏఎంసీ కార్యాలయం వద్ద కేక్‌ కట్‌చేసి మొక్కలను నాటారు. జడ్పీటీసీ శంకర్‌పటేల్‌, ఏఎంసీ చైర్మన్‌ నీరడి గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ ఎజాజ్‌ఖాన్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్‌, కోటగిరి, పొతంగల్‌ విండో చైర్మన్లు సిద్దూ, శాంతేశ్వర్‌పటేల్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ కొల్లూర్‌ కిశోర్‌బాబు, టీఆర్‌ఎస్‌ మండల మహిళా కన్వీనర్‌ స్వరూప, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ జుమ్మాఖాన్‌, జడ్పీ కో-అప్షన్‌ సభ్యుడు సిరాజ్‌, వల్లేపల్లి శ్రీనివాస్‌, బీర్కూర్‌ గంగాధర్‌, బొట్టె గజేందర్‌, అరవింద్‌, ఎత్తొండ మాజీ సర్పంచ్‌ ఆనంద్‌, బర్ల మధు, పి.సాయిలు, విజయ్‌పటేల్‌, జుబేర్‌, నజీర్‌, బీర్కూర్‌ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

వర్ని మండల కేంద్రంతోపాటు జాకోర గ్రామంలో కేకులు కట్‌చేసి మొక్కలు నాటారు. వర్ని మార్కెట్‌ కమిటీ ఆవరణలో చైర్మన్‌ బందెల సంజీవులు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీబీఆర్‌ పార్కును ప్రారంభించారు. కార్యక్రమంలో వర్ని మండల అధ్యక్షుడు కల్లాలి గిరి, జడ్పీటీసీ హరిదాస్‌, వైస్‌ ఎంపీపీ బాలరాజు, విండో అధ్యక్షుడు సాయిబాబా, కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ గంగారాం, ఉప సర్పంచ్‌ కృష్ణ, నాయకులు వీర్రాజు, గోపాల్‌, మాజీ సర్పంచ్‌ శ్రీహరి, బుజ్జి, గంగాధర్‌ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana