e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home నిర్మల్ తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత

తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత

ఎమ్మెల్యే అజ్మీరారేఖానాయక్

ఖానాపూర్‌ రూరల్‌ : తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరారేఖానాయక్‌ అన్నారు. గురువారం మండలంలోని దిలావర్‌పూర్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ , గోసంపల్లె చౌరస్తాలో హైమస్ లైట్లను ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామ పంచాయతీని అభివృద్ధి పరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటానని అన్నారు. అనంతరం దిలావర్‌ పూర్‌ గౌడ సంఘం నాయకులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణానికి రూ. 2 లక్షల ప్రొసిడింగ్‌ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ పుప్పాల శంకర్‌ , వైస్ చైర్మన్‌ గోరె గంగాధర్‌ , టీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి తూము చరణ్‌ , పీఏసీఎస్ చైర్మన్‌ అమంద శ్రీనివాస్, సర్పంచ్‌ టేకు గంగారాం, నాయకులు శోభన్‌ , టేకు మధు, నామేడ ధర్మరాజు, కొప్పుల శేఖర్‌ , జన్నారం శంకర్‌ , పంబాల రాజన్న తదితరులు పాల్గొన్నారు.ఖానాపూర్‌ పట్టణంలో శుక్రవారం జరుగనున్న దసరా ఏర్పాట్లను ఎమ్మెల్యే రేఖానాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజేందర్‌ గురువారం పరిశీలించారు. భారీ ఎత్తున నిర్మిస్తున్న రావణ విగ్రహ తయారీని వారు పరిశీలించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement