సోన్ : తెలంగాణ రాష్ట్రంలో ఆడ బిడ్డలు ఆత్మగౌరవంతో బతుకాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామంలో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 18 సంవత్స రాలు నిండిన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లాకు 2,73,947 బతుకమ్మ చీరలను వచ్చాయని వారం రోజుల్లోపు వీటిని పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించడమే కాకుండా అందులో పాల్గొన్న మహిళలకు చీరలను కానుకగా అందిస్తుందని వెల్లడించారు. తెలంగాణ సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మద ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, గ్రామ సర్పంచ్ రవీందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, నిర్మల్ మండల కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి, సీనియర్ నాయకులు అల్లోల మురళీధర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, తాసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.