e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిల్లాలు జూన్‌ 2కల్లా పనులను పూర్తి చేయాలి

జూన్‌ 2కల్లా పనులను పూర్తి చేయాలి

జూన్‌ 2కల్లా పనులను పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, మే 21 : కుంటాల మండలంలో చేపట్టిన రూర్బన్‌ అభివృద్ధి పనులను వచ్చే నెల 2 వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో రూర్బ న్‌ అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలో చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్నాయని అధికారులు వివరించారు. జూన్‌ 2కల్లా పూర్తి చేసి వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిగిలిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు వేగంగా జరిగేలా ప్రతి రోజూ పర్యవేక్షణ చేయాలని సూచించారు. అంగన్‌వాడీ పార్కు, ఆడిటోరియం పనులు వెంటనే పూర్తి చేసేలా అధికారులు చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్‌ ఈఈ శంకరయ్య, డీపీవో వెంకటేశ్వర్‌రావు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ జయంత్‌రావుచౌహాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జూన్‌ 2కల్లా పనులను పూర్తి చేయాలి

ట్రెండింగ్‌

Advertisement