e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home నిర్మల్ చేపల వేట..చేతికి వాటా..

చేపల వేట..చేతికి వాటా..

చేపల వేట..చేతికి వాటా..

నిర్మల్‌టౌన్‌/ఆదిలాబాద్‌ అగ్రికల్చరల్‌, మార్చి16 : మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం యేటా చేప పిల్లల పెంపకాన్ని చేపడుతున్నది. 2020-21 సంవత్సరానికిగాను గతేడాది జూలైలో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని  248 చిన్న చెరువుల్లో 65 లక్ష లు, 10 పెద్ద చెరువులు, 4 రిజర్వాయర్లలో 71.30 లక్షల చేప పిల్లలను విడుదల చేసింది.

30 సొసైటీలు..1900 మంది సభ్యులు..

జిల్లాలోని 15 మండలాల్లో 30 మత్స్యకార సొసైటీలు ఉం డగా, ఇందులో 1900 మంది సభ్యులు ఉన్నారు. 500 మంది లైసెన్స్‌ కలిగిన ఇతర సభ్యులు ఉన్నారు. జిల్లా మొత్తంగా 2400 మంది మత్స్యకారులు ఉన్నారు.

మొదలైన చేపల వేట..

ప్రస్తుతం చెరువుల్లో చేపలు కిలో దాకా.. రిజర్వాయర్లలో కి లోన్నర దాకా పెరిగాయి. జల వనరుల్లో నీరు ఇంకే అవకా శం ఉండడంతో కాస్త ముందుగానే చేపల వేట ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 5 వేల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆ యా మత్స్య సంఘాల ఆధ్వర్యంలో చేపలు పట్టి విక్రయిస్తున్నారు. చేపల రకాన్ని బట్టి కిలోకు రూ. 100 నుంచి రూ. 400 దాకా విక్రయిస్తున్నారు. చిన్న చెరువుల్లో పెంచిన చేపల ద్వారా ఆయా ప్రాంతాల్లోని మత్స్యకార సొసైటీల్లోని ఒక్కో సభ్యుడికి రూ. 20 వేల నుంచి రూ. 30 వేలు, ఇక రిజర్వాయర్లలో వేసిన చేపల ద్వారా ఒక్కొక్కరికీ రూ. 40 వేల నుంచి రూ. 50 వేల దాకా ఆదాయం సమకూరే అవకాశమున్నది.

మంచిర్యాల జిల్లాలో..

జిల్లాలో 89 మత్స్య పారిశ్రామిక సంఘాల్లో 5,769 మంది సభ్యులున్నారు. 2016-17 నుంచి 2017-18 వరకు రూ.10 లక్షల యూనిట్‌ విలువతో 12 కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేశారు. 4 కమ్యూనిటీ హాళ్లు పూర్తి కాగా, మరో 4 నిర్మాణంలో ఉన్నాయి. 

1.90 కోట్ల చేప పిల్లలు విడుదల..

2020-21 ఆగస్టులో 1.90 కోట్ల చేప పిల్లలను విడుదల చేశారు. 113 మత్స్యశాఖ పరిధిలోని నీటి వనరులు, 212 గ్రామ పంచాయతీ పరిధిలోని నీటి వనరుల్లో వీటిని వేశారు. ఇందులో ఎల్లంపల్లి, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులతో పాటు గొల్లవాగు, ర్యాలీవాగు, నీల్వాయి రిజర్వాయర్‌లలో 75.62 లక్షల చేప పిల్లలు విడుదల చేయగా, మిగతా 1.15 కోట్లు చెరువుల్లో చేశారు. ఇక 2020-21లో ఎల్లంపల్లి ప్రాజెక్టులో 6.15 లక్షలు, అన్నారం బ్యారేజీలో 6.88 లక్షలు, గొల్లవాగు 2.26, నీల్వాయి ప్రాజెక్టులో 2.33 లక్షలు, కుమ్మరి వాగు 1.02 లక్షలు, మత్తడి వాగు 0.72 లక్షల మంచినీటి రొయ్యలు విడుదల చేశారు. 

10 వేల టన్నుల దిగుబడి..

ప్రస్తుతం జల వనరుల్లో ఒక్కో చేప 800 గ్రాముల దాకా పెరిగింది. మే మొదటి వారంలో చేపల వేట మొదలవుతుందని, మొత్తంగా 10 వేల టన్నుల చేపలు చేతికొచ్చే అవకాశమున్నదని అధికారులు పేర్కొంటున్నారు. ఇక మే నెలాఖరుకల్లా రొయ్యలు కూడా పట్టడం మొదలవుతుంది.

ఆదిలాబాద్‌ జిల్లాలో..

ఆదిలాబాద్‌ జిల్లాలో 45 మత్స్యకార సంఘాలుండగా, 2001 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం 157 చెరువుల్లో 1.03 కోట్ల చేప పిల్లలను వదిలారు. ప్రస్తుతం చేపల వేట కొనసాగుతున్నది. మొత్తంగా 4 వేల టన్నుల దిగుబడి వచ్చే అవకాశముంది. 

నిర్మల్‌ జిల్లాలో..

ఇక నిర్మల్‌ జిల్లాలో 182 మత్స్యకార సంఘాలుండగా, 8,542 మంది సభ్యులు ఉన్నారు. గతేడాది 574 ప్రాజెక్టులు, చెరువుల్లో 4.34 కోట్ల చేప పిల్లలను విడుదల చేయగా, ప్రస్తుతం చేతికొస్తున్నాయి. ఆయా జలవనరుల్లో చేపల వేట సాగుతున్నది. చిన్నరకం చేపలకు కిలోకు రూ. 120 నుంచి 150 దాకా ధర పలుకుతుండగా, పెద్దరకం చేపలకు కిలోకు రూ. 400 దాకా విక్రయిస్తున్నారు. మొత్తంగా 17 వేల టన్నుల దిగుబడి వచ్చే అవకాశమున్నది. మహారాష్ట్ర, కోల్‌కతా, నాగ్‌పూర్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.

మా బతుకులు బాగుపడ్డయ్‌

నా పేరు గుమ్ముల సురేశ్‌. తాంసి మండలం పొన్నారి గ్రామం. టీఆర్‌ఎస్‌ సర్కారు వచ్చినంకనే మా కులవృత్తికి వెలుగొచ్చింది. మును పు మేం చేపపిల్లలను రూ. 40 నుంచి 50 వేలు పెట్టి చెరువులళ్ల వే సేటోళ్లం. కేసీఆర్‌ సారు సీఎం అయినంక మా బతుకు లు మారిపోయినయ్‌. మా ఊరి చెరువును మంచిగ చే యించిన్రు. నాతో పాటు మత్స్యకారులకు మోపెడ్‌లు ఇచ్చిన్రు. మా దగ్గర రూపాయి తీసుకోకుండా చేప పిల్లలను కల్యమ్మకుంటల వదిలిన్రు. గిప్పుడు చేపలు పెద్దగైనయ్‌. చేపలు పట్టి ఊర్లపొంటి అమ్ముతున్నం. ఎడ్లాపురం మా ర్కెట్‌కు తీసుకపోతున్నం. జిమ్మలకు ఏ కాలమైనా గిరా కీ ఉంటున్నది. మాకు గిట్టుబాటు అవుతున్నది. కేసీఆర్‌ పుణ్యమాని మా బతుకులు బాగుపడ్డయ్‌.

-గుమ్ముల సురేశ్‌ , మత్స్యకారుడు, పొన్నారి

చేపలు పట్టి అమ్ముతున్నం..

కుమ్రం భీం ప్రాజెక్టుల గతేడాది 40 లక్షల దాకా చేప పిల్లలు వేసిన్రు. ఇప్పుడవి కిలోదాకా పెరిగినయ్‌. మొ న్నటి నుంచే పడుతున్నం. ఊర్లపొంటి తిరిగి అమ్ముతు న్నం. ప్రతి రోజూ రూ. 1500 దాకా సంపాదిస్తున్నం. ఈ యేడాది ఒక్కొకరికీ రూ. 50 వేల దాకా మిగులుతయని అనుకుంటున్నం. గీ సర్కారోళ్లు మాకు ఉచితం గా మోపడ్‌లు ఇచ్చిన్రు. వలలు కూడా ఇచ్చిన్రు. ఇది వరకు బతుకుదెరువు లేక కూలీ పనికి పోయేటోళ్లం. గి ప్పుడు సీఎం కేసీఆర్‌ పుణ్యమాని మాకు చేతినిండా ప ని దొరికింది. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటం.

– రమేశ్‌, మత్స్యకారుడు, ఆసిఫాబాద్‌

చేపల వేట ప్రారంభమైంది..

జిల్లాలో ఈ ఏడాది మత్స్యకారులకు మంచి లాభాలుంటా యి. ప్రభుత్వం చెరువులు, ప్రాజక్టుల్లో వేసిన చేప పిల్లలు పెరిగాయి. ప్రస్తుతం చేపల వేట ప్రారంభమైంది. 5 వేల టన్నుల వరకు దిగుబడి రానుంది. ఒక్కో మత్స్యకారునికి రూ. 30 నుంచి రూ. 50 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశముంది.

– సాంబశివరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి

Advertisement
చేపల వేట..చేతికి వాటా..

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement