బుధవారం 24 ఫిబ్రవరి 2021
Nirmal - Jan 27, 2021 , 01:26:00

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

జిల్లాలో గణతంత్ర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, రాజకీయ పార్టీలు, వివిధ  వ్యాపార సంస్థలు, యువజన  సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. పలు చోట్ల చిన్నారులు జాతీయ నాయకుల వేషధారణతో  అలరించారు. యువ కులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. దస్తురాబాద్‌లో ఆర్మీ జవాన్లను సన్మానించారు. 

నిర్మల్‌ నియోజకవర్గంలో..

నిర్మల్‌ అర్బన్‌/ నిర్మల్‌ టౌన్‌, జనవరి 26 : జిల్లా కేంద్రంలో ఏఎస్పీ రాంరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, డీఈవో ప్రణీత, డీటీవో అజయ్‌ కుమార్‌ రెడ్డి, డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, పట్టణ సీఐ శ్రీనివాస్‌, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, సంక్షేమశాఖ అధికారులు రాజలింగం, కిషన్‌ యాదవ్‌, శ్రీనివాస్‌రెడ్డి, స్రవంతి, నీటిపారుదల శాఖ ఈఈ మల్లికార్జున్‌రావు, పంచాయతీరాజ్‌ ఈఈ శంకరయ్య, వ్యవసాయశాఖ జిల్లా అధికారి అంజిప్రసాద్‌, పశు సంవర్ధకశాఖ అధికారి రమేశ్‌ కుమార్‌, డీఎస్వో కిరణ్‌కుమార్‌, మార్కెటింగ్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ అధికారి అశోక్‌, తహసీల్దార్‌ సుభాష్‌చందర్‌, సఖీ కేంద్రం నిర్వాహకురాలు మమత, టీఎన్జీవో అధ్యక్షుడు ప్రభాకర్‌, లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తా,  మున్నూరుకాపు యువజన సంఘాల నాయకుడు అప్పాల వంశీ జెండా ఎగురవేశారు. 

మంత్రి క్యాంపు కార్యాలయంలో..

మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇంద్రకరణ్‌ రెడ్డి సోదరుడు అల్లోల సురేందర్‌ రెడ్డి జెండా ఎగురవేశారు.  

సోన్‌, జనవరి 26 : నిర్మల్‌, సోన్‌ మండలాల్లో తహసీల్దార్లు సుభాష్‌చందర్‌, జీ లక్ష్మి, ఎంపీడీవోలు సాయిరాం, ఉషారాణి, సీఐలు జీవన్‌రెడ్డి, వెంకటేశ్‌, వైద్యులు సమత, రమ్యారెడ్డి, పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు, అంగన్‌వాడీ, యువజన సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో జెండా ఎగుర వేశారు. ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, నిర్మల్‌ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  

దిలావర్‌పూర్‌, జనవరి 26 : తహసీల్దార్‌ సంతోష్‌రెడ్డి, ఎస్‌ఐ సంజీవ్‌, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, డాక్టర్‌ శ్యామ్‌కుమార్‌, ఐకేపీ ఏపీఎం వెంకటేశ్వర్లు, పీఏసీఎస్‌ చైర్మన్‌ పీవీ రమణారెడ్డి, కేజీబీవీ ఎస్‌వో అపర్ణ, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శంకర్‌ జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ ఏలాల అమృత, ఎంపీటీసీలు అక్షర, రవీందర్‌రెడ్డి, నాయకులు చిన్నారెడ్డి, దనే రవి, నరేందర్‌ పాల్గొన్నారు.

సారంగాపూర్‌, జనవరి 26:  తహసీల్దార్‌ తుకారం, ఎస్‌ఐ రాంనర్సింహారెడ్డి, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్‌ శ్యాంసుందర్‌రెడ్డి, ఏవో రాజశేఖర్‌రెడ్డి, ఈజీఎస్‌ కార్యాలయంలో ఏపీవో లక్ష్మారెడ్డి, సెర్ప్‌ ఏపీఎం మాధురి, ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్‌, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మారుతి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వంగరవీందర్‌రెడ్డి, ఎంఈవో మధుసూదన్‌, జామ్‌ కేజీబీవీ ప్రత్యేక అధికారి అన్నపూర్ణ, గురుకుల  ప్రిన్సిపాల్‌ రాగలత జాతీయజెండా ఎగురవేశారు.  

లక్ష్మణచాంద, జనవరి 26 : తహసీల్దార్‌ సత్యనారాయణ రావు, ఎస్‌ఐ యూనుస్‌ అహ్మద్‌ అలీ, ఎంపీడీవో మోహన్‌, పీఏసీఎస్‌లో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రఘునందన్‌ రెడ్డి, ఏవో ప్రవీణ్‌కుమార్‌ జాతీయ జెండా ఎగురవేశారు. 

మామడ,జనవరి 26 : తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఎస్సై వినయ్‌, ఎంపీడీవో రమేశ్‌, ట్రాన్స్‌కో ఏఈ చంద్రమౌళి జాతీయ జెండా ఎగురవేశారు.

VIDEOS

logo