అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్

- 110 కిలోల ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్, బైక్, పరికరాలు స్వాధీనం
- డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి
సోన్, జనవరి 26 : పొలాల వద్ద ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్లను పగులగొట్టి కాపర్ వైరును తీసి చోరీలు చేస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను మంగళవారం ఉదయం సోన్ పోలీసులు పట్టుకున్నారని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. సోన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా, మోర్తాడ్ మండలం దుదిగాం గ్రామానికి చెందిన మహమ్మద్ అలీ, నెహ్రూనగర్‌కు చెందిన అంకుశ్ ఏడాది కాలంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులో ఉన్న కాపర్ వైర్‌ను దొంగలిస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. సోమవారం సోన్ మండలం, మాదాపూర్ క్రాస్ రోడ్ వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద మహమ్మద్ అలీ, అంకుశ్ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పోలీసులకు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరాలు అంగీకరించారు. వీరి వద్ద నుంచి 110 కిలోల కాపర్ వైరు, ద్విచక్రవాహనం, సెల్ఫోన్లు, దొంగతనాలకు వాడుతున్న పరికరాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. దొంగలను పట్టుకున్న సోన్ సీఐ జీవన్‌రెడ్డి, ఎస్ఐ ఆసిఫ్, కానిస్టేబుళ్లు దయాకర్, సాయి కుమార్, సంజయ్, వినోద్‌ను డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డులను కూడా అందిస్తామని చెప్పారు.
తాజావార్తలు
- బైక్‌పై ముగ్గురు.. ఆపమన్మందుకు కానిస్టేబుల్‌పై కాల్పులు
- అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు లేఖ రాలేదు..
- భార్యతో గొడవ.. గొంతు కోసుకున్న భర్త
- ఖలిస్తాన్ గ్రూపుల బెదిరింపు : కెనడాలో హిందువులపై దాడుల పట్ల ఆందోళన
- పేదల కోసం ఎంజీఆర్ ఎంతో చేశారు : ప్రధాని మోదీ
- గర్భిణి చితిలో బంగారం కోసం సెర్చ్.. నలుగురు నిందితులు అరెస్ట్
- కోచింగ్ సెంటర్ విద్యార్థులకు కొవిడ్ టెస్టులు తప్పనిసరి
- మరో హాస్పిటల్‌కు టైగర్ వుడ్స్ తరలింపు
- ఆస్కార్ రేసులో ఆకాశం నీ హద్దురా.. ఆనందంలో చిత్ర బృందం
- లవర్‌తో గొడవ.. ఆటోలో నుంచి దూకిన యువతి