బుధవారం 03 మార్చి 2021
Nirmal - Jan 25, 2021 , 00:31:20

రంజనీలో తాగునీటి తండ్లాట ఒడిసింది..

రంజనీలో తాగునీటి  తండ్లాట ఒడిసింది..

  • ముథోల్‌ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి 

కుభీర్‌, జనవరి24: ‘రంజనీ, రంజనీ తండా వాసులకు తాగునీటి తండ్లాట ఒడిసింది’ అని ముథోల్‌ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు. మండలంలోని రంజనీలో వేసిన బోరుబావికి మోటర్‌ను అమర్చి  ఆదివారం ప్రారంభించారు. రెండేళ్లుగా ఈ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. ఎత్తైన ప్రదేశంలో గ్రామం ఉండడంతో మిషన్‌ భగీరథ నీరు ఎక్కడం లేదు. పైపులైన్‌ పగిలిపోవడంతో సర్పంచ్‌ బీరీబాయి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి సమస్యను వివరించారు. ఆయన డీఎంఎఫ్‌టీ నిధులు మంజూరు చేయించి స్థానిక చెరువులో బోరు వేయించారు. సమస్యతో పరిష్కారం కావడంతో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మండలకేంద్రంలో క్యాతం బాలాజీ అనే రైతు చేనులో నిర్మించిన కల్లాన్ని  ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి  పరిశీలించి, అతడిని అభినందించారు. కార్యక్రమాల్లో  నాయకులు సాహెబ్‌రావు, పీ విజయ్‌ కుమార్‌, వైస్‌ ఎంపీపీ మొహియొద్దీన్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్‌, ఎంపీటీసీ హన్మండ్లు, శంకర్‌ చౌహాన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కందూరి సంతోష్‌,  సింగిల్విండో చైర్మన్‌ రేకుల గంగాచరణ్‌, దత్తూగౌడ్‌, షేర్‌ఖాన్‌ పాల్గొన్నారు.  

నేడు ఎమ్మెల్యే పర్యటన 

కుంటాల, జనవరి 24 : ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి మండలంలో సోమవారం పర్యటించనున్నారని టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ పడకంటి దత్తు తెలిపారు. మండల కేంద్రంతో పాటు లింబా(కే), అంబకంటి, అందకూర్‌, కల్లూర్‌లో అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు భూమిపూజ, గోదాం నిర్మాణ పనుల ప్రారంభం, చెక్‌ డ్యామ్‌ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు, కార్యకర్తలు, హాజరై విజయవంతం చేయాలని కోరారు.   

VIDEOS

logo