ప్రతి గ్రామానికీ రహదారి సౌకర్యం

- మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
పెంబి, జనవరి 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికీ రహదారి నిర్మిస్తూ, మెరుగైన రవాణా సదుపాయం కల్పిస్తున్నదని దేవాదాయ, ధర్మాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని పస్పుల-తులసీపేట వంతెనను ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మితో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం అదే గ్రామాలకు పీఎంజీఎస్‌వై కింద మంజూరైన రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడారు. కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసి ప్రజలకు పాలనను మరింత అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గిరిజన, అటవీ గ్రామాలకు నేటి వరకు సరైన రహదారి సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రజల అవసరాలను గుర్తించి దశల వారీగా రోడ్డు నిర్మాణాలను చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ భుక్యా కవిత, రైతుబంధు సమితి మండల కన్వీనర్ భుక్యా గోవింద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, సర్పంచ్‌లు శేఖర్‌గౌడ్, నానాజీ, మహేందర్, వైస్ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి పాల్గొన్నారు.
కళాకారులను ప్రోత్సహించాలి
నిర్మల్ టౌన్, జనవరి 24 : కళాకారులందరికీ ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో వెన్నెల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజిగారి రాజేందర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణ గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు ఆకుల రామకృష్ణ, కొప్పుల శ్రీధర్, వెంకటరమణ, నరేందర్, అకాడమీ నిర్వాహకుడు ధన్‌రాజ్ పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, జనవరి 24 : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లింగాపూ ర్ తండా వాసులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందించాలని కోరారు. కార్యక్రమంలో తండా వాసులు స్రవంతి, రేణుబాయి, లక్ష్మి, అనిత, సునీత పాల్గొన్నారు.
తాజావార్తలు
- వ్యాక్సిన్ తీసుకున్న సీఎం విజయన్, కేంద్ర మంత్రి హరిదీప్
- కుక్కలకు ఆహారం పెడుతున్నందుకు.. ముగ్గురి నిర్బంధం
- 2 లక్షల ఖరీదైన టీవీని విడుదల చేసిన ఎల్జీ
- పిచ్‌ను విమర్శిస్తున్న వాళ్లపై కోహ్లి ఫైర్
- సెక్స్ టేప్ కేసు.. కర్నాటక మంత్రి రాజీనామా
- ఆచార్య శాటిలైట్ రైట్స్ కు రూ.50 కోట్లు..?
- అర్బన్ ఫారెస్ట్ పార్క్‌కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన
- అమెరికా మిలటరీ క్యాంపుపై రాకెట్ల దాడి
- 50 కోట్ల క్లబ్బులో ఉప్పెన
- ఆయనను ప్రజలు తిరస్కరించారు : మంత్రి హరీశ్‌రావు