శనివారం 06 మార్చి 2021
Nirmal - Jan 24, 2021 , 01:42:25

త్వరలో రెండో విడుత గొర్రెల పంపిణీ

త్వరలో రెండో విడుత గొర్రెల పంపిణీ

  • నిర్మల్‌ జిల్లా పశువైద్యాధికారి రమేశ్‌కుమార్‌

కుభీర్‌, జనవరి 23 : త్వరలో రెండో విడుత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నదని నిర్మల్‌ జిల్లా పశువైద్య అధికారి రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని పాంగ్ర గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక పశువైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం గతంలో గొల్లకుర్మలకు సబ్సిడీపై గొర్రెలను అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేశారని పేర్కొన్నారు. రెండో విడుతలోనూ జిల్లాలో 7,669 యూనిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గొర్రెలు, మేకల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్సలు చేయిస్తున్నదన్నారు. కుభీర్‌ పశువైద్యాధికారి, సిబ్బంది 265 మేకలు, గొర్రెలకు చికిత్సలు చేసి టానిక్‌లు తాగించారు. పలు జీవాలకు టీకా వేశారు. రోగాలు, నివారణపై అవగాహన కల్పించారు. ఏడీఏలు సురేశ్‌, గంగాధరయ్య, నాయకులు పోశెట్టి, రైతులు పాల్గొన్నారు. 


VIDEOS

logo