బుధవారం 03 మార్చి 2021
Nirmal - Jan 24, 2021 , 01:42:50

పథకాల అమలులో జాప్యం వద్దు

పథకాల అమలులో జాప్యం వద్దు

  • పారదర్శకత కచ్చితంగా పాటించాలి
  • రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
  • సంక్షేమ పథకాల అమలుపై జిల్లాస్థాయి సమీక్ష

నిర్మల్‌ టౌన్‌, జనవరి 23 : ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పని చేసే అధికారుల జాప్యంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వ స్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులకు సూచించారు. జిల్లాలో అ మలవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై కలెక్టరేట్‌లో ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలోని ఏడు ఎజెండాలపై శాఖల వారీగా పురోగతిని అడిగి తెలుసుకున్నా రు. కొన్ని శాఖలు సంతృప్తికర నివేదికలు సమర్పించాయి. మరికొన్ని శాఖల పనితీరు సరిగ్గా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్ర భుత్వం పల్లె ప్రగతికి ప్రతినెలా ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నదని, ఆ నిధులతో గ్రామా ల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బా ధ్యత అధికారులదేనని గుర్తు చేశారు. మిషన్‌ భగీరథ, డబుల్‌బెడ్‌రూం ఇండ్లనిర్మాణంలో అధికారులు చెప్పిన లెక్కలకు, వాస్తవ లెక్కలకు పొంతన లేదని పేర్కొన్నారు. గ్రామాల్లో పనులు పెండింగ్‌లో ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరోనా సమయంలోనూ సీఎం కేసీఆర్‌ పల్లెలకు, పట్టణాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తుంటే అధికారులు వాటిని సక్రమంగా ఉపయోగించడం లో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించా రు. జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌పై సమీక్షించారు. ఫిబ్రవరి 1 నుంచి తరగతులు పునః ప్రారంభమవుతున్నందున పాఠశాలలను శుభ్రం చేయాలని కోరారు. విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో థర్డ్‌లైన్‌ ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. డబుల్‌బెడ్‌రూం ఇండ్ల పథకం లో పురోగతి ఆశించినస్థాయిలో లేదని, ఇప్పటివరకు ఇండ్లు నిర్మించిన చోట లబ్ధిదారుల ఎంపిక చేపట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంజూరైన ఇండ్లకు టెండర్లు పెట్టి ని ర్మాణాన్ని పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల్లో సబ్సిడీ రు ణాలు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి నివేదికను ఎప్పటికప్పుడు కలెక్టర్‌ దృష్టికి తేవాలని తెలిపారు. ముథోల్‌ నియోజకవర్గం లో అభివృద్ధి పనుల అమలులో కొన్నిశాఖల అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అధికారులపై మండిపడ్డారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజలకు సేవ చేయడం నేర్చుకోవాలని సూ చించారు. ఖానాపూర్‌ నియోజకవర్గంలోని గి రిజన బిడ్డలకు అధికారులు న్యాయం చేయలేకపోతున్నారని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నా రు. డబుల్‌బెడ్‌రూం ఇండ్లను పూర్తి చేయాలని పేర్కొన్నారు. జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చే యాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ సూచించారు. అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, జిల్లా సంక్షేమశాఖల అధికారులు స్రవంతి, కిషన్‌యాదవ్‌, రాజలింగం, డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, డీపీవో వెంకటేశ్వర్‌రావు, డీఆర్వో రమేశ్‌ రాథోడ్‌, పీ ఆర్‌ ఈఈలు శంకరయ్య, తుకారాం, జిల్లా వై ద్యాధికారి ధన్‌రాజ్‌, వైద్యులు కార్తిక్‌, అవినా శ్‌, ఆయాశాఖల అధికారులు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, అంజిప్రసాద్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo