మంగళవారం 02 మార్చి 2021
Nirmal - Jan 23, 2021 , 00:58:02

జిల్లా అభివృద్ధికి కష్టపడి పని చేయాలి

జిల్లా అభివృద్ధికి కష్టపడి పని చేయాలి

  • మంత్రి అల్లోల

నిర్మల్‌ టౌన్‌, జనవరి 22 : నిర్మల్‌ జిల్లా అభివృద్ధికి అధికారులు కష్టపడి పని చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. మంత్రితో పాటు జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పాల్గొన్నారు.  ఫిబ్రవరి 1 నుంచి 9, ఆపై తరగతులను ప్రారంభిస్తున్నందున పాఠశాలల్లో, సం క్షేమ హాస్టళ్లల్లో, ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో కొవిడ్‌ టీకా అమలుపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. మా ర్కెటింగ్‌, వ్యవసాయం, సంక్షేమం, విద్య, వైద్యం, పని, ప్రణాళిక, తదితర శాఖలపై సమావేశంలో చర్చించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి నివేదికలను మంత్రి దృష్టికి అధికారులు నివేదించారు. సమావేశంలో జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, జిల్లా అధికారులు శ్రీనివాస్‌రెడ్డి, కిషన్‌యాదవ్‌, రాజలింగం, కిరణ్‌కుమార్‌, శ్రీనివాస్‌, అంజిప్రసాద్‌, జయంత్‌రావుచౌహాన్‌, మల్లికార్జున్‌, డాక్టర్‌ వేణుగోపాలకృష్ణ, వినూత్న, స్రవంతి, ప్రణీత, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యులు డాక్టర్‌ సుభాష్‌రావు, రఫిక్‌, స్థాయీ సంఘాల చైర్మన్లు శారద, కల్పతాయి, గంగామణి పాల్గొన్నారు. 

108 పైలెట్‌ మరణంపై మంత్రి ఆరా..

కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందిన 108 పైలెట్‌ విఠల్‌రావు రెండు రోజుల క్రితం నిర్మల్‌ ప్రభుత్వ దవాఖానలో కొవిడ్‌ టీకాతో మృతి చెందాడన్న ఫిర్యాదుపై మంత్రి అల్లోల ఆరా తీశారు. విఠల్‌రావు మృతికి కారణాలను జిల్లా వైద్యులు వేణుగోపాలకృష్ణ, కార్తిక్‌ను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌తో చనిపోలేద ని, గుండెపోటు వచ్చి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. పోస్టుమార్టం వివరాల ను ల్యాబొరేటరీకి పంపించామని, నివేదిక వచ్చి న తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

VIDEOS

logo