కొవిడ్ టీకా వేయించుకోవాలి

- కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
ఖానాపూర్ టౌన్, జనవరి 22: కొవిడ్-19 టీకా పై వస్తున్న వదంతులు నమ్మకుండా ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానలోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. కొవిడ్ టీకాపై ప్రజలు భయాందోళనకు గురికావద్దని, పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ను పరిశీలించాకే అందుబాటులోకి తెచ్చామన్నారు. టీకా వేసుకున్న వారి వివరాలను దవాఖాన సూపరింటెండెంట్ వంశీమాధవ్‌ను అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం దవాఖానలోని ప్రసూతి వార్డు, జనరల్ వార్డులను ఆయన పరిశీలించారు. అంతకుముందు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణలో శానిటైజ్ చేయకపోవడం, చెత్తను తొలగించక పోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశా రు. డీఎంహెచ్‌వో ధన్‌రాజ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీకాంత్, హెచ్‌ఈవో శైలేంద్ర కన్నయ్య, కొవిడ్ మండల ఇన్చార్జి వెంకటేశ్వర్లు, సబ్ యూనిట్ అధికారి గాడ్పు రవికుమార్, హెచ్ఈ జయలలిత, హెల్త్ సూపర్వైజర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ నాగరాజు, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో బాలే మల్లేశం, మున్సిపల్ కమిషనర్ తోట గంగాధర్, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- దురాజ్‌పల్లి జాతర.. రేపటినుంచి వాహనాల దారి మళ్లింపు
- కిడ్నాప్.. 6 గంటల్లో ఛేదించారు
- వాణి వినిపించాలంటే.. విద్యావేత్తకే పట్టం కట్టాలె..
- పదపద.. ప్రచారానికి..
- ఇక ప్రజా క్షేత్రంలో...సమరమే..
- ఏపీ అమరావతిలో వింత శబ్దాలతో భూకంపం
- మార్చిలోనే మధురఫలం
- రాష్ట్రంలో 39 డిగ్రీలకు చేరిన ఎండలు
- 27-02-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
- జీవకోటికి.. ప్రాణవాయువు