అన్నదాతకు ఆత్మీయ బిడ్డలు

- ఆప్యాయతతో దగ్గరవుతున్న ఏఈవోలు
- ఆప్యాయతతో దగ్గరవుతున్న ఏఈవోలు
- సర్కారు, రైతులకు వారధిగా సేవలు
- నిత్యం పల్లెల్లో అందుబాటులో ఉంటూ సాగుపై సలహాలు, సూచనలు
- అధిక దిగుబడులు సాధించేలా అవగాహన
- సంక్షేమ పథకాలు అందేలా కృషి
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 130 మంది యువతులే
నిర్మల్ టౌన్, జనవరి 22: తెలంగాణ సర్కారు వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు 2018లో వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టుల(ఏఈవో)ను భర్తీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 303 క్లస్టర్లు ఉండగా, ఇందులో 173 మంది పురుషులు, 130 మంది మహిళలు ఏఈవోలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక నిర్మల్ జిల్లాలో మొత్తం 79 వ్యవసాయ కస్టర్లు ఉండగా, అందులో నియమితులైన ఉద్యోగుల్లో 37 మంది మహిళలే ఉన్నారు. ఇందులో 24 ఏళ్లలోపు వారే 35 మంది ఉన్నారు. వీరంతా అన్నదాతలకు అందుబాటులో ఉంటూ పంటల దిగుబడి, రైతు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్నదాతల ఆత్మీయ బిడ్డలుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. భూసారాన్ని మొదలుకొని ఏఏ విత్తనాలు వేసుకోవడం, ఎరువులు వాడడం, సస్యరక్షణ చర్యలు, యాంత్రీకరణ, పంటలు ఆన్లైన్ చేయడం, ఎలాంటి పురుగుల మందులు వాడడం, పంట మార్పిడి పద్ధతులు, హైబ్రిడ్ వంగడాల పెంపు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు.
పురుగు మందుల వాడకంపై సుచిత్ర సూచనలు
మామడ క్లస్టర్లో పనిచేస్తున్న ఏఈవో సుచిత్ర పురుగు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. రైతులు పురుగు మందులు పిచికారీ చేసిన తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలని, మందు భూమిపై పడకుండా చెట్టుకొమ్మలపై పడేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
‘రైతు బీమా’ అందేలా దివ్య..
కడెం మండలం పెద్దబెల్లాల్ వ్యవసాయ క్లస్టర్లో పనిచే స్తున్న ఏఈవో దివ్య సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి కీ అందేలా కృషి చేస్తున్నారు. ఎక్కడ ఏ రైతు చని పోయినా ఇంటికెళ్లి పూర్తి వివరాలు సేకరించి రైతు బీమా డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటున్నా రు. పత్రాలను ఆన్లైన్ చేయడం వంటివి చేస్తున్నా రు. ఉన్నతాధికారులతో మాట్లాడి వారం, పది రోజుల్లో డబ్బులు బాధిత కుటుంబాల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
పంటల వివరాలు నమోదు చేస్తున్న సుమిత్ర
మామడ మండలం పొన్కల్ గ్రామంలో ఏఈవోగా పని చేస్తున్న సుమిత్ర క్లస్టర్లో పంటల సాగుపై పక్కాగా సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. క్లస్టర్ పరిధిలో ఏ రైతుకు ఎంత భూమి ఉంది. గతంలో ఏఏ పంట వేశాడు. ప్రస్తుతం ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేశాడు. గతంలో దిగుబడి ఎంత వచ్చింది. వంటి వివరాలను నమోదు చేసుకుంటున్నారు.
పంట కల్లాల నిర్మాణంపై శ్రీదేవి ప్రత్యేక శ్రద్ధ
దిలావర్పూర్ మండలంలో ఏఈవోగా పని చేస్తున్న బండారి శ్రీదేవి కల్లాల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ క్లస్టర్ పరిధిలో 22 పంట కల్లాలను మంజూరు చేయగా, ఇప్పటికే 15 పూర్తి చేయించారు.
లింగాకర్షక బుట్టలపై మనీషా అవగాహన
మామడ మండలం దిమ్మదుర్తిలో పని చేస్తున్న ఏఈవో మనీషా పత్తి పంటలో పురుగుల ఉధృతిని నివారిం చేందుకు లింగాకర్షక బుట్టలపై రైతులకు క్షేత్రస్థా యిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా సరఫరా చేసే లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవడం వల్ల పురుగుల ఉధృతిని నివారించవచ్చని, దీనివల్ల పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వాటిని ఎలా అమర్చాలి. ఎక్కడ లభిస్తాయి. వంటి వివరాలతో అవగాహన కల్పిస్తున్నారు.
రైతు వేదికలపై రజినిది కీలక పాత్ర
సోన్ మండలం కడ్తాల్ క్లస్టర్ పరిధిలో పని చేస్తున్న రజిని రైతు వేదిక నిర్మాణాల్లో కీలకపాత్ర పోషించారు. రైతులకు ఉపయోగపడేలా దగ్గరుండి రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేయించారు.
యాంత్రీకరణపై సుప్రియ..
సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామ క్లస్టర్లో పని చేస్తున్న ఏఈవో సుప్రియ వరినాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు యాంత్రీకరణ సాగు విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. కూలీల కొరత నేపథ్యంలో యాంత్రీకరణ ద్వారా రైతులు లాభాలను పొందవచ్చని వివరిస్తున్నారు.
తాజావార్తలు
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు