శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Nirmal - Jan 22, 2021 , 00:25:43

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

భైంసా, జనవరి 21 :  ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని పట్టణ సీఐ వేణుగోపాల్‌రావు అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా పట్టణంలోని శివాజీ చౌక్‌లో రవాణా, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని కోరారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంవీఐలు గజరాల వేణు, శివస్వప్న, ఏఎంవీఐ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

కడెం, జనవరి 21: డ్రైవర్లు రోడ్డు భదత్రా నియమాలు పాటించాలని, ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని ఏఎస్‌ఐ భీంరావు  సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మండలకేంద్రంలో  ఆటో, జీపు డ్రైవర్లకు అవగాహన కల్పించారు. యూనిఫాంలు ధరించాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమం లో పోలీసు సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు.

VIDEOS

logo