ఆదివారం 07 మార్చి 2021
Nirmal - Jan 22, 2021 , 00:25:15

సీఎం కేసీఆర్‌తో ప్రారంభించేందుకు ఏర్పాట్లు

సీఎం కేసీఆర్‌తో ప్రారంభించేందుకు ఏర్పాట్లు

  • రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 
  • నిర్మల్‌లో తెలంగాణ భవన్‌ సందర్శన

సోన్‌, జనవరి 21: టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో నిర్మించిన పార్టీ కార్యాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌ మండలం కొండాపూర్‌ శివారులో నూతనంగా నిర్మించిన తెలంగాణ భవన్‌ కార్యాలయాన్ని మంత్రి ఐకేరెడ్డి గురువారం సందర్శించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పార్టీ సమావేశాలు నిర్వహించుకునేందుకు తెలంగాణ భవన్‌ ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో నిర్మల్‌ జిల్లా పర్యటన ఖరారు కానున్నట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌తో పాటు ఆడిటోరియం, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రిని ఇప్పటికే ఆహ్వానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, సర్పంచ్‌ నవాత్‌ గంగాధర్‌, ఎఫ్‌ఏసీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీగారి రాజేందర్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు సుభాష్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు రాంకిషన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు దేవేందర్‌ యాదవ్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo