శనివారం 06 మార్చి 2021
Nirmal - Jan 22, 2021 , 00:25:11

టీకాపై అపోహ వీడాలి

టీకాపై అపోహ వీడాలి

  • నిర్మల్‌ డీఎంహెచ్‌వో ధన్‌ రాజ్‌

 నిర్మల్‌ అర్బన్‌, జనవరి21 : అపోహలు వీడి కరోనా టీకా తీసుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని డీఎంహెచ్‌వో ధన్‌రాజ్‌ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో కొవిడ్‌ -19 వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. అనంతరం కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. కొవిడ్‌ టీకా తీసుకున్న ఓ వ్యక్తి అనారోగ్యంతో  మృతి చెందడంతో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు భరోసా ఇచ్చేందుకు  టీకా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే దేశంలో 8 లక్షల మంది టీకా తీసుకున్నారని ఎవరికి ఏమీ కాలేదని తెలిపారు.

VIDEOS

logo