శనివారం 27 ఫిబ్రవరి 2021
Nirmal - Jan 21, 2021 , 01:20:23

పల్లె ప్రగతి పనులను వేగవంతం చేయాలి

పల్లె ప్రగతి పనులను  వేగవంతం చేయాలి

  • అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

మామడ, జనవరి20 :  పల్లె ప్రగతి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులు, సర్పంచ్‌లను నిర్మల్‌ అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే ఆదేశించారు. మండలంలోని రాయదారి గ్రామంలో శ్మశాన వాటిక, పంట కల్లాల నిర్మాణ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట కల్లాలపై రైతులకు అవగాహన కల్పించి, నిర్మించుకునేలా చూడాలన్నారు. నిర్మాణ పనులను ప్రతి రోజూ పర్యవేక్షించి, వేగవంతంగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్‌, పీఆర్‌ ఏఈ ఉమాశంకర్‌, ఏపీవో శివాజీ, పంచాయతీ కార్యదర్శి రాణి, ఏఈవో సృజిత తదితరులు ఉన్నారు.

VIDEOS

logo