గురువారం 04 మార్చి 2021
Nirmal - Jan 20, 2021 , 01:58:45

కొనసాగుతున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

కొనసాగుతున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

నిర్మల్‌ అర్బన్‌,జనవరి19 : జిల్లాలో కొవిడ్‌ -19 వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నది. జిల్లాలోని పలు పీహెచ్‌సీల్లో మంగళవారం వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్‌, ఏరియా దవాఖాన, బంగల్‌పేట్‌ అర్బన్‌ పీహెచ్‌సీలో మూడో రోజు టీకాలు వేశారు. 

దిలావర్‌పూర్‌, జనవరి 19 : దిలావర్‌పూర్‌ పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ను ఎంపీపీ ఏలాల అమృత ప్రారంభించారు. డాక్టర్‌ శ్యామ్‌కుమార్‌ మొదటి టీకా వేశారు. మొదటి రోజు 100 మందికి టీకా వేసినట్లు తెలిపారు.  కార్యక్ర మంలో సర్పంచ్‌ వీరేశ్‌కుమార్‌, రైతు బంధు సమితి జిల్లా కమిటీ సభ్యుడు ఏలాల చిన్నారెడ్డి, తహసీల్దార్‌ సంతోష్‌రెడ్డి, ఎంపీడీవో గడ్డం మోహన్‌రెడ్డి, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ రాజశేఖ ర్‌రెడ్డి, రాజశేఖర్‌, వేణు,  సిబ్బంది పాల్గొన్నారు.

సారంగాపూర్‌, జనవరి 19:  మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. మొదటి టీకాను హెల్త్‌సూపర్‌ వైజర్‌ కృష్ణమోహన్‌గౌడ్‌కు వేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకట్రాంరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వంగ రవీందర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ ఐర నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ మాధవరావు, వైస్‌ ఎంపీపీ పతాని రాధ, సర్పంచ్‌ సుజాత, ఎంపీటీసీ పద్మ, ఎంపీడీవో సరోజ, నాయకులు రాజ్‌మహ్మద్‌, శ్రీనివాస్‌రెడ్డి, రాజు, నర్సారెడ్డి పాల్గొన్నారు. 

సోన్‌, జనవరి 19 : నిర్మల్‌, సోన్‌ మండలాల్లోని ముజ్గి, సోన్‌, న్యూవెల్మల్‌ బొప్పారం పీహెచ్‌సీల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీపీలు రామేశ్వర్‌రెడ్డి, మానస, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి, వైద్యులు సమతారెడ్డి, రమ్యా రెడ్డి, రాజేందర్‌, నాయకులు వెంకయిగారి శ్రీని వాస్‌రెడ్డి, సర్పంచ్‌లు వినోద్‌కుమార్‌, మల్లేశ్‌ యాదవ్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

లక్ష్మణచాంద, జనవరి 19 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఎంపీపీ కేశం లక్ష్మి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్‌ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. మొత్తం 76 మందికి టీకా  వేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ నాగేశ్వర్‌ రావు, సర్పంచ్‌ సురకంటి ముత్యంరెడ్డి, ఎంపీటీసీ అడ్వా ల పద్మ, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ కృష్ణారెడ్డి, నాయకులు అడ్వాల రమేశ్‌, ఈటెల శ్రీనివాస్‌, జహీరొద్దీన్‌ పాల్గొన్నారు.

భైంసా/భైంసా టౌన్‌, జనవరి 19 : పట్టణంలోని పీహెచ్‌సీలో పని చేసే సిబ్బందికి మంగళవారం కొవిడ్‌-19 టీకా వేశారు. కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఖలీం, సిబ్బంది పాల్గొన్నారు. భైంసా మండలం మహాగాం పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. పీహెచ్‌సీ వైద్యుడు శ్రీకాంత్‌కు మొదటి టీకా వేశారు. అనంతరం 100 మంది అంగన్‌వాడీ సిబ్బంది, ఆశ, ఆరోగ్య కార్యకర్తలకు టీకా వేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్పనా జాదవ్‌, సర్పంచ్‌ అప్పాల రాకేశ్‌, ఎంపీటీసీ పోశెట్టి, ఎంపీడీవో గోపాల కృష్ణారెడ్డి, ఎస్‌ఐ పున్నం చందర్‌, హెచ్‌ఈవో సలీం, హెచ్‌ఏ నరేశ్‌, గణేశ్‌ పటేల్‌  తదితరులు పాల్గొన్నారు.

తానూర్‌, జనవరి19: మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రజాప్రతినిధులు, అధికారులు మంగళవారం ప్రారంభించారు. మొదటి టీకాను ఆయుర్వేద వైద్యుడు భాస్కర్‌రావుకు వేశారు. అనంతరం పీహెచ్‌సీలో పని చేస్తున్న సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బందికి వేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల  సంఘం మండలాధ్యక్షుడు తాడేవార్‌ విఠల్‌, ఆత్మ చైర్మన్‌ కానుగంటి పోతారెడ్డి, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, పీహెచ్‌సీ డాక్టర్‌ సుభాష్‌, ఎంపీడీవో శ్రీనివాస రావు, ఎస్‌ఐ రాజన్న, సీహెచ్‌వో అబ్బాస్‌ నఖ్వీ, మాజీ సర్పంచ్‌ దార్మోడ్‌ రాములు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు

కుంటాల, జనవరి 19 : కుంటాల పీహెచ్‌సీలో వైద్య, అంగన్‌వాడీ సిబ్బందికి కొవిడ్‌ టీకాలు వేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గజ్జారాం, సర్పంచ్‌ సమత, ఎంపీడీవో దేవేందర్‌ రెడ్డి, డాక్టర్‌ ఆయేషా, శ్రీకాంత్‌, అంగన్‌వాడీ, హెల్త్‌ సూపర్‌వైజర్‌ లక్ష్మీ విశారద, చిన్నన్న, కార్యదర్శి అశోక్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు డీ వెంకటేశ్‌ పాల్గొన్నారు. 

లోకేశ్వరం, జనవరి 19 : మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో ఆరోగ్య సిబ్బందికి డాక్టర్‌ హారిక టీకా వేశారు. మండలానికి మొదటి విడుతలో 110 డోసులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్‌ లోలం శ్యాంసుందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రత్నాకర్‌రావు, ఎంపీటీసీ జయసాగర్‌రావు, నాయకులు బాయమొల్ల భోజన్న, కపిల్‌, సాయన్న, తహసీల్దార్‌ వెంకటరమణ, ఎంపీడీవో బీ గంగాధర్‌, నాయబ్‌ తహసీల్దార్‌ అశోక్‌, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఉన్నారు. 

కుభీర్‌, జనవరి19:  కుభీర్‌ పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఎంపీపీ తూం లక్ష్మి ప్రారంభించారు. హెల్త్‌ సూపర్‌ వైజర్‌ గిరి సాయిబాబ, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఆరోగ్యశాఖ సిబ్బందికి టీకా వేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ ఇక్రమొద్దీన్‌, నిగ్వ ఎంపీటీసీ దొంతుల దేవిదాస్‌, తహసీల్దార్‌ ప్రభాకర్‌, డీటీ వెంకటరమణ, ఎంపీడీవో శేఖర్‌, వైస్‌ ఎంపీపీ మొహియొద్దీన్‌, కుభీర్‌ ఏఎంసీ చైర్మన్‌ కందూరి సంతోష్‌, డాక్టర్‌ అవినాశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సంజయ్‌ చౌహాన్‌, పీరాజీ, సిబ్బంది పాల్గొన్నారు. 

పెంబి, జనవరి 19: పెంబి పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సినేషన్‌ను ఎంపీపీ భూక్యా కవిత, జడ్పీటీసీ జానుబాయి ప్రారంభించారు. ముందుగా వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బందికి టీకాలు వేశారు. మొదటి రోజు మొత్తం 61 మందికి టీకా  వేసినట్లు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ నాగరాజు, వైస్‌ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, నాయకులు సల్లా నరేందర్‌ రెడ్డి, స్వప్నిల్‌ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కడెం : కడెం పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సినేషన్‌ జడ్పీటీసీ పురపాటి శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు రఫిక్‌హైమద్‌, కడెం సర్పంచ్‌ కొండపురం అనూష ప్రారంభించారు. దవాఖాన సూపర్‌వైజర్‌కు తొలి టీకా వేశారు. పీహెచ్‌సీ వైద్యాధికారి అరుణ్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రభావతి, అంగన్‌వాడీ టీచర్లు,వైద్య సిబ్బంది, పాల్గొన్నారు. 

కొవిడ్‌ టీకా సురక్షితం 

దస్తురాబాద్‌, జనవరి19 : కొవిడ్‌ టీకా సురక్షితమేనని, ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్‌ అన్నారు.మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. టీకా వేసుకున్న వారిని  పరిశీలించారు. దస్తురాబాద్‌ పీహెచ్‌సీ వైద్యులు 82 మందికి టీకాలు ఇచ్చినట్లు తెలిపారు. అంతకు ముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ప్రారంభించారు. కార్యక్రమం లో ఎంపీపీ సింగరి కిషన్‌, వైస్‌ ఎంపీపీ భూక్యా రాజు నాయక్‌, సర్పంచ్‌ నిమ్మతోట రాజమణి, తహసీల్దార్‌ బత్తుల విశ్వంభర్‌, ఏఎస్సై భీంరావు, డాక్టర్‌ సుధాకర్‌, హెచ్‌ఈవో వేణు గోపాల్‌, వైద్య సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo