Nirmal
- Jan 20, 2021 , 01:28:58
VIDEOS
వ్యాక్సిన్‌పై అపోహ వీడాలి

భైంసా, జనవరి 19 : కొవిడ్-19 నివారణ వ్యాక్సిన్‌పై అపోహ వీడాలని ప్రజలకు నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సూచించారు. భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన కొవిడ్-19 వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్‌పై అపోహ వీడి స్వచ్ఛందంగా టీకా తీసుకోవచ్చని తెలిపారు. టీకా వేసుకున్న అనంతరం 30 నిమిషాలు దవాఖానాలోని రెస్ట్ రూంలో కూర్చోవాలని సూచించారు. జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రకియ సజావుగా సాగుతున్నదని ఆయన తెలిపారు. ఈయన వెంట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ కాశీనాథ్, డా.అనిల్, డా.సురేందర్ తదితరులున్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING