రోడ్డు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలు దూరం

నిర్మల్ అర్బన్, జనవరి18 : వాహనాదారులు రోడ్డు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోలో సోమవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆర్టీసీ సిబ్బందికి రోడ్డు ప్రమాదాల నివారణపై అవగా హన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ఆర్టీసీ ముందంజలో ఉందన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు పూర్తి నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడుపుతారనే నమ్మకంతో ప్రయాణికుల్లో ఉందన్నారు. ప్రయా ణికుల నమ్మకాన్ని కాపాడుకోవాలని, ప్రమా దాల నివారణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎం ఆంజనేయులు, డిపో అధికారులు ప్రతిమా రెడ్డి, విశ్వనాథ్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రయాణికుల భద్రత మీ చేతుల్లోనే..
భైంసా, జనవరి 18: బస్సులో ప్రయాణించే వారి భద్రత డ్రైవర్ల చేతుల్లోనే ఉంటుందని భైంసా పట్టణ సీఐ వేణుగోపాలరావు అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని బస్సు డిపోలో ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయ వద్దని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ రవీందర్రావు, కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.
సోన్, జనవరి 18: జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మండలంలోని గంజాల్ టోల్‌ప్లాజా ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోన్ సీఐ జీవన్‌రెడ్డి మాట్లాడారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పీడీ శ్రీనివాస రావు, ప్రాజెక్ట్ మేనేజర్ ప్రణయ్చందర్, ఎంహెచ్ఈ సురేందర్‌రావు, ధనుంజయ్, ఎం రాజు, హేమంత్ కుమార్, పీఆర్వో స్వామి, గంజాల్, కడ్తాల్ సర్పంచ్‌లు బోనగిరి నవీన్, నర్సయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- హిందీలో రీమేక్ అవుతున్న ఆర్ఎక్స్ 100.. ఫస్ట్ లుక్ విడుదల
- సర్కారు వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగించాం : మంత్రి ఈటల
- వైరల్ వీడియో : పాట పాడుతున్న పులి
- అంతరిక్షంలో హోటల్.. 2027లో ప్రారంభం
- బెంగాల్ పోరు : లెఫ్ట్, ఐఎస్ఎఫ్తో కూటమిని సమర్ధించిన కాంగ్రెస్
- కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గదు: ప్రపంచ ఆరోగ్యసంస్థ
- కిడ్నాప్ అయిన 317 మంది బాలికలు రిలీజ్
- పవన్ నాలుగో భార్యగా ఉంటాను : జూనియర్ సమంత
- ఇన్సూరెన్స్ సంస్థలకు ఐఆర్డీఏ న్యూ గైడ్‌లైన్స్
- పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించే యోచనలో ఆర్థిక శాఖ