శనివారం 27 ఫిబ్రవరి 2021
Nirmal - Jan 18, 2021 , 02:16:48

వడ్యాల్‌లో క్రికెట్‌ పోటీలు ప్రారంభం

వడ్యాల్‌లో క్రికెట్‌ పోటీలు ప్రారంభం

లక్ష్మణచాంద, జనవరి 17 :  వడ్యాల్‌ మాజీ సర్పంచ్‌ నల్లా రాంరెడ్డి స్మారకార్థం  ఏర్పాటు చేసిన క్రికెట్‌ పోటీలను మంత్రి ఐకేరెడ్డి తనయుడు, టీఆర్‌ఎస్‌ యువనేత అల్లోల గౌతం రెడ్డి   ఆదివారం ప్రారంభించారు. యువత అన్ని రంగాల్లో రాణించాలన్నారు. యువకులు ఆటల్లో రాణించాలని సూచించారు. గ్రామీణ యువత క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాల న్నారు. పోటీలు నిర్వహిస్తున్న వైస్‌ ఎంపీపీ నల్లా కల్పనారాంరెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ కేశం లక్ష్మి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్‌, నాయకులు సాతం గంగారాం, సల్లా రాజేంద్ర ప్రసాద్‌, గుజ్జారి గణేశ్‌, జహీరొద్దీన్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo